
దక్షిణ చైనా సముద్రంలో భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉన్న ద్వీపం తైవాన్. దీని రాజధాని తైపీ. ఇది ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. సొంత రాజ్యాంగంతో పాటు ప్రజస్వామ్య యుతంగా ఎన్నికైన నాయకులు ఉన్నారు. మూడు లక్షల సొంత సైన్యం కూడా ఉంది. అయితే దీన్ని చైనా తమ రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణిస్తోంది. ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. మెజారిటీ తైవాన్ ప్రజలు చైనా వైఖరిపై మండిపడుతుంటారు. కానీ వాణిజ్య పరంగా చాలా వరకు తైవాన్ చైనాపైనే ఆధారపడుతుంది. అమెరికా మాత్రం తైవాన్కు ఏదో ఒక స్థాయిలో సాయపడుతుంటుంది. అయితే ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జీన్ పింగ్ మాట్లాడుతూ.. ‘‘ముమ్మాటికీ తైవాన్ మా దేశంలో అంతర్భాగమే. సంపూర్ణ విలీనానికి తైవాన్ అంగీకరించన పక్షంలో సైనిక దాడికి కూడా వెనకడాం”అంటూ హెచ్చరించారు. అలాగే తైవాన్ జాతీయ దినోత్సవాన్ని గుర్తించరాదని, తైవాన్ ను ఒక దేశంగా గుర్తించవద్దంటూ అన్నీ దైశాలపై చైనా ఒత్తిడి తెస్తోంది. చైనాలో అంతర్భాగంగానే గుర్తించాలని లేకుంటే.. సదరు దేశాల సంస్థలను తమ దేశంలో వ్యాపారం చేయకుండా అడ్డుకుంటామని చెప్పింది.
Also Read: బిహార్‌లో ఆ పార్టీకే అందలం.. సర్వేలో తేలిందిదే..
ఈక్రమంలో వ్యూహాత్మకంగా భారత్.. తైవాన్ తో వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ చైనా కుతకుతలాడుతోంది. తైవాన్ వాణిజ్య దోస్తీ పెట్టుకుంటే తమను సంప్రదించాలని కోరినట్టు సమాచారం. 2018లో ద్వై పాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత భారత్ తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కోసం తైవాన్ విస్తృత కసరత్తులు చేసి సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల తైవాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మీడియా శుభాకాంక్షలు తెలిపితే చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా తప్పుబట్టింది.
ఇదే విషయమై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ ఏ దేశమైనా తైవాన్ ఒప్పందంపై సంతకం చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. టిబెట్ సమస్యలపై ప్రత్యేక సమన్వయ కర్తగా రాబర్ట్ డిస్ట్రో ను నియమించడ, బహిష్కరణకు గురైన టిబెటన్ నేత లోబ్సాంగ్ సంగేతో ఆయన సమావేశం కావడంపై కూడా అమెరికాతో దౌత్య పరమైన నిరసన వ్యక్తం చేసినట్టు చైనా తెలిపామని లిజియాన్ తెలిపారు. టిబెట్ తమ అంతర్గత వ్యవహారమని జావో ప్రకటించారు.
Also Read: ‘దుబ్బాక’ ప్రచారం ఎవరు ముందున్నారంటే?
మొత్తానికి చైనా తమ అంతర్భాగాలుగా చెప్పుకుంటున్న టిబెట్, తైవాన్ దేశాలతో ప్రపంచంలోని ఏ దేశమైనా సంబంధాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తే అవి రాజకీయ పునాదిగా మారి తమకు ఇక్కట్లు కలుగజేస్తుందని చైనా నమ్ముతుంది. అదే క్రమంలో పాకిస్తాన్ ను మన దేశం వైపు ఎగదోస్తూ.. మన సరిహద్దు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. అలాంటి చైనాకు దాని చుట్టుపక్కల దేశాలతో భారత్ స్నేహం చేసి అభయహస్తం ఇస్తే చైనాకు చెక్ పెట్టవచ్చు.