Gopichand Malineni : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపైతే దక్కుతుంది. దర్శకుల విషయానికి వస్తే మన దర్శకులు ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మనకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడంలో మన స్టార్ డైరెక్టర్లు తీవ్రమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Read : గోపీచంద్ మలినేని మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని(GopiChand Malineni)…ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఈ సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయినా సన్నీ డియోల్ (Sunny Deol) తో ఆయన చేసిన జాట్ (Jaat) సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా దర్శకుడిగా అతనికి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం ఆయన తెలుగులో మరోసారి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందే వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాతో భారీ విజయన్ దక్కించుకున్నాడు కాబట్టి అతనికి స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి నటులు గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడికి అవకాశం ఇస్తే ఒక కమర్షియల్ సినిమాని చేసి పెట్టగలడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలుగుతున్న దర్శకులందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న గోపిచంద్ మలినేని సైతం యాక్షన్ ఎంటర్టైనర్లను తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక మొత్తానికైతే జాట్ సినిమాతో బాలీవుడ్ లో ఇతనికి విపరీతమైన క్రేజ్ అయితే దక్కింది. మరి ఆ సినిమాను కంటిన్యూ చేస్తూ మిగతా సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఆ స్టార్ హీరో స్టోరీ తోనే సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్న గోపిచంద్ మలినేని…