Homeఅంతర్జాతీయంUS China Trade War: అమెరికా విమానాల కొనుగోలుపై నిషేధం.. ట్రేడ్‌వార్‌లో మరో కీలక నిర్ణయం!

US China Trade War: అమెరికా విమానాల కొనుగోలుపై నిషేధం.. ట్రేడ్‌వార్‌లో మరో కీలక నిర్ణయం!

US China Trade War: అమెరికాచైనా ట్రేడ్‌ వార్‌లో మరో మరో కీలక నిర్వర్ణయం తీసుకుంది. ఇప్పటికే చైనా అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపివేసింది. తాజాగా అమెరికా కంపెనీల నుంచి విమానాలు కొనుగోలుచేయొద్దని నిర్ణయించింది. ఈమేరకు చైనా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య అమెరికాచైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత ఉధృతం చేయవచ్చని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బోయింగ్‌ కంపెనీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది, మరియు చైనా నిషేధం ఈ సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అదే సమయంలో, చైనా తన దేశీయ విమాన తయారీ సంస్థలైన COMAC (Commercial Aircraft Corporation of China) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం.. ఈసారి చైనాపై 245% సుంకాలు

దేశీయ విమాన పరిశ్రమకు ఊతం
చైనా తన సొంత విమాన తయారీ పరిశ్రమను బలోపేతం చేయడానికి గత కొన్నేళ్లుగా కషి చేస్తోంది. COMAC యొక్క C919 విమానం బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ A320 లకు పోటీగా అభివృద్ధి చేయబడింది. అమెరికా విమానాలపై నిషేధం విధించడం ద్వారా చైనా తన దేశీయ విమానాలకు మార్కెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. అయితే, ఇ919 ఇంకా అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరపడలేదు, ఇది చైనా విమానయాన సంస్థలకు సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు.

అంతర్జాతీయ ప్రభావం
ఈ నిషేధం గ్లోబల్‌ విమానయాన పరిశ్రమపై కూడా ప్రభావం చూపనుంది. బోయింగ్‌ కంపెనీకి చైనా ఒక ప్రధాన మార్కెట్, ఈ నిషేధం వల్ల ఆ సంస్థ ఆర్థిక లాభాలు తగ్గవచ్చు. అమెరికాలో ఉద్యోగాలపై కూడా పరోక్ష ప్రభావం చూపవచ్చు. మరోవైపు, యూరోపియన్‌ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని చైనా మార్కెట్‌లో తన వాటాను పెంచుకునే అవకాశం ఉంది.

చైనా ఈ నిర్ణయం అమెరికాచైనా వాణిజ్య సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది. ఇది ఒక వైపు చైనా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయగలిగినా, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితిని పెంచుతుంది. ఈ పరిణామాలు గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.

Also Read: టారిఫ్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version