https://oktelugu.com/

Vodafone Idea:  వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త.. రూ.155కే అపరిమిత కాల్స్?

Vodafone Idea:  గడిచిన నెల రోజుల్లో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, జియో టరిఫ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. టారిఫ్ రేట్లు పెరగడంతో కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 155 రూపాయల చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 24 రోజులు కావడం గమనార్హం. రెండు సిమ్ లను వాడే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2021 / 03:23 PM IST
    Follow us on

    Vodafone Idea:  గడిచిన నెల రోజుల్లో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, జియో టరిఫ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. టారిఫ్ రేట్లు పెరగడంతో కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 155 రూపాయల చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 24 రోజులు కావడం గమనార్హం. రెండు సిమ్ లను వాడే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

    Vodafone Idea

    కొత్త రీఛార్జ్ కింద వొడాఫోన్ ఐడియా 155 రూపాయలు, 239 రూపాయలు, 666 రూపాయలు, 699 రూపాయల ప్లాన్లను ప్రవేశపెట్టింది. 155 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 300 మెసేజ్ లను పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు 1జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. కాల్స్ మాత్రమే మాట్లాడే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

    Also Read: ఈ-శ్రమ్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.2 లక్షల బెనిఫిట్?

    వొడాఫోన్ ఐడియా 666 రూపాయల ప్లాన్ ను ప్రవేశపెట్టగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ ఇంటర్నెట్ తో పాటు అపరిమిత కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. బింగే ఆల్ నైట్, డేటా డిలైట్ ఆఫర్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఈ ప్లాన్ లో అందుబాటులో ఉండటం గమనార్హం. వొడాఫోన్ ఐడియా 699 ప్రీ పెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

    ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్స్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఉచితంగా హంగామా ప్రీమియం సభ్యత్వం లభించనుంది.

    Also Read: విరాట్ కోహ్లీ వర్సెస్ గంగూలీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్ ఇదే