Nari Nari Naduma Murari Teaser: అన్ని సంక్రాంతి పండుగలకు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు పోటీ పడడం సర్వ సాధారణమే. అలా ఈ పండక్కి కూడా భారీ పోటీ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు ఈ పండగకు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా శర్వానంద్ కూడా ఈ పండగ లో జాయిన్ కాబోతున్నాడు. అంటే మొత్తం ఆరు సినిమాలు ఈ పండక్కి సందడి చేయబోతున్నాయి అన్నమాట. గత కాలం నుండి వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్నా శర్వానంద్(Sharwanand) ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో చేసిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari Movie). తనకు గతంలో బాగా కలిసొచ్చిన ఎంటెర్టైమెంట్ జానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్.
ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తేనే ఈసారి కామెడీ గట్టిగా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తోంది. సందర్భానికి తగ్గట్టుగా ఈ గ్లింప్స్ లో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ఒకటి బాగా పేలింది. ‘ఇంత పోటీ వాతావరణంలో మీ ఎంట్రీ అవసరమా?’ అని వెన్నెల కిషోర్ శర్వానంద్ ని అడగ్గా, ‘ప్రతీ పండగకి వర్కౌట్ అవుతుంది కదా సార్, అలా ఈ పండగకి కూడా వర్కౌట్ అవుతుందని’ అని బదులిస్తాడు శర్వానంద్. ‘వీడు మారడు..నాకు తెలిసి నీకు తుత్తర ఎక్కువే’ అని వెన్నెల కిషోర్ అనగా, కరెక్ట్ సార్ అని పక్కనే ఉన్న నరేష్ అంటాడు. గ్లింప్స్ మొత్తం చాలా ఫన్నీ గా, రాబోయే సంక్రాంతి సీజన్ పరిస్థితి ని వివరిస్తున్నట్టుగా అనిపించింది. జనవరి 14న ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈ నెల 22 న విడుదల చేయబోతున్నారు మేకర్స్.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సాక్షి చేస్తున్న రెండవ చిత్రమిది. చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించే ఈమె, ఈ చిత్రం హిట్ అయితే పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. గతం లో ఈయన శ్రీ విష్ణు తో ‘సామజవరగమనా’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కామెడీ వేరే లెవెల్ లో వర్కౌట్ అయ్యింది. కచ్చితంగా ఈ చిత్రం లో కూడా కామెడీ ఆ రేంజ్ లోనే వర్కౌట్ అయ్యే ఫీల్డ్ కనిపిస్తున్నాయి.
