https://oktelugu.com/

AP Govt: కొత్త రూల్స్ తో థియేటర్లకు సినిమా చూపించబోతున్న ఏపీ సర్కార్..!

AP Govt: ఏపీ లో ప్రభుత్వానికి థియేటర్ యాజమాన్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతి ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. థియేటర్ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం సంపాదించింది. దీంతో ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపించేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి మరి స్టే తెచ్చుకుని ప్రభుత్వానికి చుక్కెదురు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 18, 2021 / 03:23 PM IST
    Follow us on

    AP Govt: ఏపీ లో ప్రభుత్వానికి థియేటర్ యాజమాన్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతి ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. థియేటర్ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం సంపాదించింది. దీంతో ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపించేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది.

    AP govt

    థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి మరి స్టే తెచ్చుకుని ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యే విధంగా చేసాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసే విధంగా చేసాయి. సినిమా విడుదల అయినప్పుడు టికెట్ రేట్ ను పెంచుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లినందుకు ఏపీలో థియేటర్ యాజమాన్యాలకు చుక్కలు చూపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది.

    ఎప్పుడో అటకెక్కిన పాత నిబంధనలను కూడా దుమ్ము దులిపి మరి బయటకు తీస్తుంది. ఆ రూల్స్ తో ఇప్పుడు థియేటర్ యాజమాన్యానికి చుక్కులు చూపించనుంది. ఏ చిన్న లోపం కనిపించిన థియేటర్ లను సీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని వందల థియేటర్ లకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది.

    Also Read: YCP: టీడీపీ పొత్తుల వ్య‌వ‌హారం వైసీపీలోనే హాట్ టాపిక్‌.. ఎందుకంటే..?

    ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లిన థియేటర్ లను జగన్ ప్రభుత్వం మార్క్ చేసుకుని మరి దాడులకు దిగడానికి సిద్ధం అవుతుంది. అసలే కరోనా కష్టాలు, పైగా టికెట్ తగ్గింపు, ఇక చాలా మంది థియేటర్లను మూసివేయాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ దాడులు వీరిని మరింత కష్టాల్లోకి నెట్టి వేస్తున్నాయి. ఈ సమస్యలతో ఎపి లో థియేటర్ లు మూసి వేస్తారని సినీ పరిశ్రమ ఆందోళన చెందుతుంది. ప్రభుత్వ కొత్త నిభంధనలతో థియేటర్ యాజమాన్యాలకు కష్టాలు తప్పేట్టు లేవు. మరి చూడాలి ప్రభుత్వం ఎంత వరకు వెళ్తుందో.. థియేటర్ యాజమాన్యాలు ఎన్ని కష్టాలు భరించాలో..

    Also Read: Three Airports: ప్రైవేటీకరణ మంత్రం.. ఏపీలో మూడు విమానాశ్రయాలపై కన్ను

    Tags