Avatar 3 First Day Collections: ఒకపక్క ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకి ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ వసూలు సునామి ని ఎదురుకోలేక విడుదల అవ్వాల్సిన కొన్ని సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కేవలం ‘అవతార్ 3’ మాత్రమే ‘దురంధర్’ ని తట్టుకోగలదు అని అంతా అనుకున్నారు. కానీ ‘అవతార్ 3′(Avatar 3 : The Fire And Ash) పై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘దురంధర్’ ప్రభావం పడింది అంటే నమ్ముతారా?. దురంధర్ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి నిన్న 23 కోట్ల రూపాయిల వసూళ్లు వస్తే, ‘అవతార్ 3’ చిత్రానికి 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండు సినిమాల మధ్య ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇక ఇండియా వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలుపుకొని చూస్తే ‘అవతార్ 3’ చిత్రానికి 35 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవరాల్ వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కేవలం చైనా దేశం నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 123 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. అదే విధంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మొదటి రోజు + ప్రివ్యూ షోస్ కలిపి 105 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 1101 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఓవరాల్ గా చైనా + నార్త్ అమెరికా కలిపే ఈ చిత్రానికి 2200 గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లు 300 మిలియన్ డాలర్స్ కి పైగానే ఉంటుందని, ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 3300 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది.
మన ఇండియన్ సూపర్ హిట్ సినిమాకు లైఫ్ టైం మొత్తం కలిపినా రానటువంటి గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి కేవలం మొదటి రోజే వచ్చిదంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఓపెనింగ్స్ అనేది. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి. ఓపెనింగ్స్ ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం 4 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనిపిస్తోంది. సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలకు లాంగ్ రన్ ఉంటాయి. కానీ ఈ చిత్రం ఓపెనింగ్స్ నుండే బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఇక లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.