Family Star movie : అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో ఫ్యామిలీ స్టార్… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

యాక్షన్ థ్రిల్లర్ గా ఇది తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.

Written By: NARESH, Updated On : April 24, 2024 9:42 pm

Good news for Vijay Deverakonda fans of Family Star movie in OTT

Follow us on

Family Star movie : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అనుకున్న దానికంటే కొన్ని రోజుల ముందే ఈ సినిమా ఓటీటీ లోకి రానుంది. ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు ఓటిటీ లో వస్తుంది? ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది?… ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండను వరుస ప్లాప్ లు వెంటాడుతున్నాయి. అర్జున్ రెడ్డి, గీత గీత గోవిందం తర్వా ఆ రేంజ్ హిట్ మరొకటి పడలేదు. విజయ్ దేవరకొండను సక్సెస్ ట్రాక్ ఎక్కించే సినిమా రావడం లేదు.

భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స్వల్ప నష్టాలతో బయటపడింది. ఇక లేటెస్ట్ రిలీజ్ ఫ్యామిలీ స్టార్ కూడా నిరాశే మిగిల్చింది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద వద్ద బోల్తా పడింది. ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది.

దీంతో అనుకున్న సమయానికి వారం రోజుల ముందే ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా ఏపిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి . కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. VD12 వర్కింగ్ టైటిల్ గా ఉంది. గతంలో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథను విజయ్ దేవరకొండ ఓకే చేశాడని సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూడాచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఇది తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.