https://oktelugu.com/

Anakapalle : బరిలోకి కొత్త అభ్యర్థి.. నాయుడికి షాక్!

జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ కోసం వెయిట్ చేసిన అడారి కిషోర్ కుమార్ రేపు తన నామినేషన్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గురువారం నామినేషన్ ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి నుంచి బీఫామ్ వస్తే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. లేకపోతే బరిలో నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2024 / 09:23 PM IST

    Adari Kishore Kumar as YCP candidate for Anakapalle MP seat?

    Follow us on

    Anakapalle MP Seat : అనకాపల్లి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంత కూడా కావడంతో రాజకీయం పరంగా చాలా మెచ్యూర్ గా ప్రజలు వ్యవహరిస్తారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 14 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జనాభాలో సుమారు 75 శాతానికి పైగా ప్రజలు కాపు, వెలమ, గవర కులాలకు చెందిన వారు ఉన్నారు. అనాదిగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ కులానికి చెందిన నాయకులకే ఇక్కడ ఎంపీ టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ కమ్మ కులానికి చెందిన సీఎం రమేష్ అనే నాయకుడికి ఇచ్చింది. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆచీ తూచీ అడుగు వేయాలని అనుకున్నారు. సరైన అభ్యర్థి కోసం చాలా కాలం వెయిట్ చేశారు. ఆఖరికి బూడి ముత్యాల నాయుడుకి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు.

    అయితే, ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ అనూహ్యంగా సిఎం జగన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆడారి కిషోర్ కుమార్ చాలా కాలంగా టీడీపీలో ఉంటూ వివిధ కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలకు చురుగ్గా నాయకత్వం వహించినప్పటికీ, తనకి పార్టీలో తగిన గుర్తింపు రాలేదు.

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుంచి పార్లమెంటు టిక్కెట్టుపై హామీ రాకపోవటంతో, ఆడారి కిషోర్ కుమార్ వైసీపీకి మారాలని నిర్ణయించుకున్నాడు. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఆడారి కిషోర్ కుమార్ ను రేపు అభ్యర్థిగా రేపు వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.  ఆడారి కిషోర్ కుమార్ ను సీఎం జగన్ రెడ్డి కూడా డైనమిక్ నాయకుడు అని కొనియాడారు. అనకాపల్లి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి బీసీ కావాలని జగన్ రెడ్డి భావించారు. దీంతో బూడి ముత్యాల నాయుడు కంటే ఎక్కవ క్యాలిఫికేషన్లు ఉన్న వ్యక్తి కిషోర్ కావడంతో ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ఆడారి కిషోర్ కుమార్ ను బరిలో కి దింపేదుకు చూస్తోంది. సూచన ప్రాయంగా రేపు తన నామినేషన్ దాఖలు చేయాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది.

    ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న అడారి కిషోర్ కుమార్.!

    అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి అనుకుంటూ వచ్చాడు అడారి కిషోర్ కుమార్. నామినేషన్లకు ఆఖరి గడువు అయినా రేపు నామ పత్రాలను సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అతను సన్నిహితులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ కోసం వెయిట్ చేసిన అడారి కిషోర్ కుమార్ రేపు తన నామినేషన్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గురువారం నామినేషన్ ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి నుంచి బీఫామ్ వస్తే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. లేకపోతే బరిలో నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.