Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi- Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒకే వేడుక పై ...

Chiranjeevi- Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒకే వేడుక పై చిరు – పవన్.. లీకైన భారీ సర్ ప్రైజ్

Chiranjeevi- Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ పై మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో వస్తోంది ఈ సినిమా. కాగా రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా హైప్‌ను మ‌రింత పెంచేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌ర్ స్టార్‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట చిత్ర బృందం.

Chiranjeevi- Pawan Kalyan
Chiranjeevi- Pawan Kalyan

మరి ఇది ఖాయ‌మైతే మాత్రం మెగాఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులుండ‌వు. కారణం పవన్ – చిరును ఒకే వేదిక పై చూసి చాలా కాలం అయ్యింది. అందుకే, ఈ వేడుకకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు.

Also Read: Prabhas Adipurush: ఇదీ ప్రభాస్‌ రేంజ్ అంటే.. ?, ఆది పురుష్‌ కి కనక వర్షం.. తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ కి ఎవ్వరూ ఊహించని డబ్బులు ?

పైగా ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగడంతో సినిమా పనుల్లో స్పీడ్ డబుల్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడట. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట.

మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Chiranjeevi- Pawan Kalyan
Chiranjeevi- Pawan Kalyan

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Also Read:Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడా? ఎప్పుడు? ఆ కథేంటి?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper
Exit mobile version