Sreemukhi: స్టార్ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతుంది. ఈ బుల్లితెర రాములమ్మకు అంతకంతకు అవకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ డాన్స్ రియాలిటీ షో లాంచింగ్ ఈవెంట్ లో మాస్ మెస్మరైజింగ్ సాంగ్ కి ఓ రేంజ్ లో ఊపేసింది. గ్లామరస్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు శ్రీముఖి. అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాత ఆ రేంజ్ పాపులారిటీ శ్రీముఖి సొంతం. గత ఐదేళ్లుగా శ్రీముఖి కెరీర్ ఊపందుకుంటూ వస్తుంది. పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వెన్నక్కి తిరిగి చూసుకోలేదు. తన మార్కు కామెడీ పంచెస్, యాంకరింగ్ స్కిల్స్ తో బుల్లితెరపై రాణిస్తుంది.

ఒకపక్క టెలివిజన్ షోస్ తో బిజీగా ఉన్న శ్రీముఖి డిజిటల్ షోస్ లో కూడా రంగ ప్రవేశం చేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా పలు షోస్ ప్రసారం చేస్తుంది. వినూత్నమైన ఎంటర్టైనింగ్ కంటెంట్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆహాలో ప్రసారమైన బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ హిట్. సెకండ్ సీజన్ త్వరలో ప్రసారం కానుంది. అలాగే సెప్టెంబర్ 11 నుండి డాన్స్ ఐకాన్ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.కాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
డాన్స్ ఐకాన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో శ్రీముఖి మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. పుష్ప చిత్రంలోని మాస్ మసాలా సాంగ్… ”ఊ అంటావా మావా” సాంగ్ కి హాట్ స్టెప్స్ తో పిచ్చెక్కించింది. పింక్ కలర్ కోటు సూటు వేసిన శ్రీముఖి కేక పుట్టించారు. కాస్ట్యూమ్ కూడా మ్యాచ్ ఐతే పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉండేదనిపించింది. అప్పటికీ పాప అసలు తగ్గలేదు. ఇక శ్రీముఖితో జడ్జి శేఖర్ మాస్టర్ జాయిన్ అయ్యాడు. ఇద్దరూ స్పైసీ మూమెంట్స్ తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. మొత్తంగా శ్రీముఖి పెర్ఫార్మన్స్ ఆడియన్స్ గుండెల్లో సెగలు రేపింది. ఆమె టాలెంట్ ని నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా పొగిడారు.

ఊహించని రీతిలో డాన్స్ ఇరగదీస్తున్న శ్రీముఖి అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంది. యాంకర్ సుడిగాలి సుధీర్ మాదిరి ఈ మల్టీ టాలెంటెడ్ యాంకర్ హైట్స్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు శ్రీముఖి నటిగా ప్రయత్నాలు చేస్తున్నారు . క్రేజీ అంకుల్స్ మూవీతో సోలో హీరోయిన్ గా కూడా శ్రీముఖి మారారు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. నితిన్ హీరోగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి విలన్ భార్య రోల్ చేశారు. అనసూయ, శ్రీముఖి మాదిరి హీరోయిన్ గా వెలిగిపోవాలనే ఆలోచనల్లో శ్రీముఖి ఉన్నారు. కెరీర్ లో ఎదగాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా…