Good..bad..ugly చాలా కాలం తర్వాత తమిళ హీరో అజిత్(Thala Ajith) సినిమా కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూడడం ‘గుడ్..బ్యాడ్..అగ్లీ'(Good..Bad..Ugly Movie) చిత్రానికి జరగబోతుంది. రీసెంట్ గా విడుదలను అజిత్ సినిమాలన్నీ నేటి తరం యూత్ ఆడియన్స్ అభిరుచులకు దూరంగా ఉన్నాయి. అందుకే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ లను అందుకోలేకపోయాయి. అజిత్ క్రేజ్ కారణంగా కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి కానీ, జనాలకు నిజమైన ఎంటర్టైన్మెంట్ ని అందించిన అజిత్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ‘గుడ్..బ్యాడ్..అగ్లీ’ చిత్రం మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఫీలింగ్ ని అందరిలో తెచ్చిపెట్టింది. వింటేజ్ అజిత్ మార్క్ హీరోయిజం ని నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఆ వింటేజ్ మార్క్ ని ఈ సినిమా ద్వారా చూపించాడు డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్(Adhvik Ravichandran).
Also Read : ప్రియుడితో తమన్నా విడిపోయినట్లేనా.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మిల్కీ బ్యూటీ ఎఫైర్
ఈయన అజిత్ కి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అనేది రీసెంట్ గా విడుదలైన టీజర్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. అజిత్ అభిమానులను మెంటలెక్కిపోయేలా చేసింది ఈ టీజర్. అయితే ఈ సినిమాలో అభిమానులు ఊగించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒక కీలక పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంచారట. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ చేశారట. ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మించిన సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 11 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళం తో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా ఏకకాలం లో విడుదల కాబోతుంది.
ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఉన్నాడు అనే టాక్ రావడంతో, మన టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బాలయ్య ఉండడం వల్ల కనీసం 10 కోట్ల రూపాయిల కలెక్షన్స్ కలిసొస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ చేసింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో నెల రోజుల క్రితమే ‘విడాముయార్చి’ అనే చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. తెలుగు లో ఈ సినిమాని ‘పట్టుదల’ అనే పేరుతో విడుదల చేసారు. ఇక్కడ అయితే కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశపర్చిన కాంబినేషన్ నుండి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ గా అజిత్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : 500 మంది డాన్సర్స్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సాంగ్..’నాటు నాటు’ ని మించిన స్టెప్పులతో ఫ్యాన్స్ కి పండగే!