IND vs AUS
IND vs AUS : ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions trophy 2025) భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా (IND vs AUS) పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో వికెట్లు మొత్తం కోల్పోయి 264 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఎదుట 265 పరుగుల టార్గెట్ విధించింది. ఈ టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో టీమిండియా ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (28), గిల్(8) పరుగులు చేసి అవుట్ అయ్యారు.
Also Read : మన బౌలర్లు భళా.. దుబాయ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన టార్గెట్ ఎంతంటే?
రోహిత్ శర్మ కొన్నోల్లీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్ డ్వార్ష్ యిష్ బౌలింగ్ లో బంతిని బ్యాట్ ఇన్ సైడ్ ఎర్జ్ కు ఆడి.. వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (9*), శ్రేయస్ అయ్యర్ (0*) క్రీజ్ లో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 218 పరుగులు చేయాలి. ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ విసిరిన త్రో మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో హార్దిక్ పాండ్యా 47వ ఓవర్ వేశాడు. అతడు వేసిన తొలి బంతిని క్యారీ(60) పాయింట్ దిశగా ఆడాడు. క్విక్ డబుల్ తీయడానికి క్యారీ ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న శ్రేయస్ అయ్యర్ బంతిని నేరుగా వికెట్ల వైపు విసిరాడు. దీంతో బంతి ఏమాత్రం గురి తప్పకుండా వికెట్లను పడగొట్టింది. దీంతో క్యారీ నిరాశగా వెను తిరిగాడు. అప్పటికే క్యారీ 60 పరుగులు చేశాడు. ఒకవేళ అతడు గనుక రన్ అవుట్ కాకుండా ఉండి ఉంటే భారత్ మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. క్యారీ అప్పటికే దూకుడు మీద ఉన్నాడు. 56 బంతులు ఎదుర్కొని 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు రన్ అవుట్ కావడంతో అది ఆస్ట్రేలియా స్కోర్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఫలితంగా ఆస్ట్రేలియా 264 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒకవేళ క్యారీ గనుక అలాగే నిలబడి ఉంటే ఆస్ట్రేలియా స్కోర్ 280+ పరుగులకు పైగా చేరుకునేది. అప్పుడు టీమ్ ఇండియాకు అది కఠినమైన టార్గెట్ గా ఉండేది. ప్రస్తుతం దుబాయ్ మైదానం స్పిన్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో.. టీమిండి ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. గిల్ పేస్ బౌలర్ బౌలింగ్ లో అవుట్ అయినప్పటికీ.. రోహిత్ శర్మ స్పిన్ బౌలర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ విసిరిన త్రో నేరుగా వికెట్లను పడగొట్టడంతో క్యారీ ఒకసారిగా షాక్ కు గురయ్యాడు. అసలు ఆ బంతిని నేరుగా వికెట్ల వైపు ఎలా విసిరాడని నివ్వెర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇదే సమయంలో అయ్యర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : ఆస్ట్రేలియా దిగ్గజం పాంటింగ్ రికార్డు బద్దలు. సరికొత్త ఘనత సృష్టించిన విరాట్ కోహ్లీ.
What a direct hit from shreyas Iyer to get Alex carey run out.
He is pumped uppic.twitter.com/iUmxljsg7t— Radha (@Rkc1511165) March 4, 2025
Direct hit, direct from heart! ♥️#ShreyasIyer #INDvAUS #ChampionsTrophy pic.twitter.com/vQCyvQj0It
— Punjab Kings (@PunjabKingsIPL) March 4, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ind vs aus shreyas iyers throw was the highlight of the match
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com