Tamannaah Batia breakup
Tamannaah Batia : రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది తమన్నా. 2004లో తమన్నా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హ్యాపీ డేస్, 100 % లవ్ చిత్రాలతో తమన్నా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో తమన్నా నటించింది. చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ తో కూడా జతకట్టిన రికార్డు ఆమె సొంతం. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది . కొన్నాళ్లుగా తమన్నా హిందీ చిత్రాలు చేస్తుంది. డిజిటల్ సిరీస్ల పై కూడా దృష్టి పెట్టింది.
తమన్నా నటించిన బోల్డ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ యాంథాలజీ సిరీస్లో తమన్నా నటుడు విజయ్ వర్మతో రొమాన్స్ చేసింది. నటనలో భాగంగా దగ్గరైన విజయ్ వర్మ-తమన్నా.. నిజంగానే ప్రేమలో పడిపోయారు. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ టైం లోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని తమన్నా పలుమార్లు వెల్లడించింది. 2023 న్యూ ఇయర్ వేడుకలు రహస్యంగా కలిసి జరుపుకున్న తమన్నా-విజయ్ వర్మల ఎఫైర్ బయటకు పొక్కింది. మొదట్లో ఈ వార్తలను ఖండించారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కొట్టిపారేశారు. అనంతరం నిజమే అంటూ అంగీకరించారు.
Also Read : హీరో కార్తీకి షూటింగ్ లో తీవ్ర గాయాలు..హాస్పిటల్ కి తరలింపు..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!
రెండేళ్లకు పైగా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. విదేశాల్లో విహరించారు. విందులు, సినిమా వేడుకల్లో కలిసి పాల్గొనేవారు. పెళ్లి ఎప్పుడని అడిగితే తమన్నా దాటవేస్తూ వచ్చింది. 2024లోనే పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఇక 2025లో ఖచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అభిమానులు భావించారు. అనూహ్యంగా ఈ జంట విడిపోయారు అనేది లేటెస్ట్ న్యూస్. విజయ్ వర్మతో తమన్నా కలవడం లేదు. ఎక్కడికెళ్లినా ఒంటరిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రియుడికి తమన్నా బ్రేకప్ చెప్పిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది.
తెలుగులో తమన్నా చివరిగా భోళా శంకర్ మూవీలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఓదెల 2 లో ప్రధాన పాత్ర చేస్తుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల కుంభ మేళా వేదికగా టీజర్ విడుదల చేశారు. ఓదెల 2 టీజర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. ఓదెల 2 విజయం సాధిస్తుందని తమన్నా ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Also Read : ‘కడుపు మండిన కాకుల కథ’..దుమ్ములేపిన నాని ‘ది ప్యారడైజ్’ టీజర్..కానీ అవేమి బూతులు సామీ!
Web Title: Tamannaah batia tamannaah seems to have broken up with boyfriend vijay varma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com