Good Bad Ugly Movie : తమిళ హీరో అజిత్(Thala Ajith) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం విడుదలై నిన్నటితో రెండు వారాలు పూర్తి అయ్యింది. కేవలం వీకెండ్ తో ఈ చిత్రం సర్దేస్తుందని చాలా మంది సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ఈ చిత్రం ముందుకు దూసుకుపోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలింది. ఆ ప్రాంతాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రాలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ 6 కోట్ల 20 లక్షలు మాత్రమే. కానీ షేర్ కేవలం 3 కోట్ల 10 లక్షలు మాత్రమే వచ్చింది.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రం..ఎందులో చూడాలంటే!
అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యమే. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ సినిమాకు స్టడీ వసూళ్లు నమోదు అవ్వడమే. సోమవారం నుండి బుధవారం వరకు ఈ చిత్రానికి ప్రతీ రోజు పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవుతూ వచ్చింది. ఎంత వసూళ్లు వచ్చినా ఈ వారం లోనే రావాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ చిత్రానికి మరో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకున్న రెండవ ప్రాంతం కేరళ. ఇక్క కేవలం రెండు వారాలకు కలిపి 3 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. సూపర్ హిట్ అవ్వాలంటే ఆరు కోట్ల రూపాయిల షేర్ రావాలి. కానీ గ్రాస్ కూడా అంత వచ్చేలా కనిపించడం లేదు.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి రెండు వారాల్లో 142 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటకలో 14 కోట్ల గ్రాస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్, ఓవర్సీస్ లో 62 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన ఒక సినిమాకు ఇంత వసూళ్లు రావడం అనేది చరిత్ర లో ఎప్పుడూ జరగలేదు. ఇక అజిత్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Also Read :’పుష్ప 2′ కి యావరేజ్ టీఆర్ఫీ రేటింగ్స్..ఇంత తక్కువ రావడానికి కారణం అదేనా?