Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఇండియా లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా మేనియా నుండి మన ఇండియన్స్ బయటకి రాలేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, ఆయన పలికిన డైలాగ్స్ కి యావత్తు భారతదేశ యువత మెంటలెక్కిపొయింది. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతే ఖాన్స్ త్రయం కూడా. ఆ స్థాయి ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు అల్లు అర్జున్ ఈ సినిమాతో. థియేటర్స్ లో మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది.
Also Read : ‘పుష్ప 2’ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇన్నాళ్లకు విషయం బయటపెట్టిన థమన్ ?
ఇప్పటికీ కూడా టాప్ 10 లో గత 13 వారాల నుండి నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంత పెద్ద ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాని రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ వస్తుందని అందరు ఆశించారు కానీ, కేవలం 12.61 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. థియేటర్స్ లో ఓటీటీ లో ఈ సినిమా సాధించిన విజయం తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ‘పుష్ప’ చిత్రానికి మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు 23 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ‘పుష్ప’ టెలికాస్ట్ సమయంలో ఇతర చానెల్స్ లో పెద్దగా ప్రోగ్రామ్స్ ఏమి ఉండేవి కాదు, అందుకే ఆ చిత్రానికి అంతటి రెస్పాన్స్ వచ్చింది. కానీ ‘పుష్ప 2’ కి ఉన్న పరిస్థితులు వేరు.
ఎందుకంటే జీ తెలుగు లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ‘పుష్ప 2’ టెలికాస్ట్ అయిన రోజునే టెలికాస్ట్ చేశారు. అంతే కాకుండా మరోపక్క పీక్ IPL సీజన్ కొనసాగుతుంది. ఈ రెండిటి వల్లే టీఆర్పీ రేటింగ్స్ యావరేజ్ గా వచ్చాయని, లేకపోతే 20 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవని అంటున్నారు. అంతే కాకుండా చాలా సమయం తీసుకొని టీవీ టెలికాస్ట్ చేయడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యింది అని చెప్పొచ్చు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తర్వాత టీవీ టెలికాస్ట్ చేశారు. కానీ ‘పుష్ప 2’ కి మాత్రం విడుదలైన నాలుగు నెలల తర్వాత టీవీ టెలికాస్ట్ చేసారు. అందుకే రేటింగ్స్ పై బలమైన ఎఫెక్ట్ చూపించినట్టు తెలుస్తుంది. కానీ రిపీట్ టెలికాస్ట్ లో ఈ సినిమా దంచి కొట్టే అవకాశం లేకపోలేదు.
Also Read : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!