Good Bad Ugly Collection: ‘విడాముయార్చి’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత అజిత్ కుమార్(Ajith Kumar) కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. కమర్షియల్ గా కూడా చాలా కాలం తర్వాత ఆయనకు సరైన క్లీన్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా కి వచ్చిన వసూళ్లు, అజిత్ రేంజ్ లో లేవు అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. సినిమాకు టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ పై నెగటివ్ రివ్యూస్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఈ చిత్రం ఎక్సక్లూసివ్ గా అజిత్ ఫ్యాన్స్ కి మాత్రమే, ఇతరులు చూడలేరు అనే టాక్ గట్టిగా వినపడింది.
Also Read: 8 రోజుల్లో 14 లక్షల టిక్కెట్లు..గ్రాస్ విషయం లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ‘హిట్ 3’!
అదే టాక్ బయట కూడా ఉండడంతో ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయింది . నిన్ననే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. దాదాపుగా అన్ని థియేటర్స్ నుండి ఈ సినిమాని లేపేశారు కూడా. అయితే వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. తమినాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అనేది ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కానీ నిర్మాతలు మాత్రం 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈమధ్య కాలం లో అందరూ నిర్మాతలు అలాగే చేస్తున్నారు, కానీ మేము మాత్రం ట్రేడ్ నుండి వచ్చిన లెక్కలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము.
ఆ విధంగా చూస్తే ఈ చిత్రానికి కేవలం తమిళనాడు నుండి 150 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. అదే విధంగా ఓవర్సీస్ నుండి 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక నుండి 14 కోట్ల 50 లక్షలు, కేరళ నుండి 4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 245 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కమర్షియల్ గా సూపర్ హిట్, కానీ ఇది విజయ్ మొదటి వారం వసూళ్ల కంటే తక్కువ అని చెప్పొచ్చు. అజిత్ విజయ్ లాగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా తియ్యాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.