Hit 3 Collection: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తన ప్రతీ సినిమాతో తన రేంజ్ ని ఎలా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘దసరా’ కి ముందు నాని ఒకే తరహా సినిమాలు చేస్తున్నాడు, ఒకే తరహా యాక్టింగ్ చేస్తున్నాడు, ఇలా అయితే కష్టం అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఎప్పుడైతే ఆయన తన ప్రధాని మార్చాడో ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని హ్యాట్రిక్ హీరో గా నిలిచాడు. ఇప్పుడు ‘హిట్ 3′(Hit : The Third Case) సూపర్ హిట్ తో మరో హ్యాట్రిక్ కి తెరలేపాడు. ఈ చిత్రంలో ఆయన హీరో గా నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మొదటి వారం లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు, బుక్ మై షో యాప్ లో 12 లక్షల టిక్కెట్లు కేవలం 8 రోజుల్లో అమ్ముడుపోయాయట.
Also Read: ‘రెట్రో’ 8 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..100 కోట్లకు ఎంత దూరంలో ఉందంటే!
అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా కలిపి మొత్తం మీద ఆన్లైన్ ద్వారా ఈ చిత్రానికి 14 లక్షల టిక్కెట్లు సేల్ అయ్యాయట. మీడియం రేంజ్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు గా పిలవొచ్చు. ఫుల్ రన్ లో కచ్చితంగా రెండు మిలియన్ల మార్కుని ఈ చిత్రం అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక బ్రేక్ ఈవెన్ మార్కుని ఓవరాల్ గా 6 రోజుల్లోనే అందుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా 8 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి. రోజుకి 70 లక్షలకు తక్కువ లేకుండా షేర్ వసూళ్లు ఈ ప్రాంతం నుండి వస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 8 రోజులకు 15 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ తో 20 కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకుంటుందని అంటున్నారు. ‘దసరా’ తర్వాత నాని కి నైజాం ప్రాంతం లో 20 కోట్ల షేర్ ని సాధించిన రెండవ చిత్రంగా దీనిని పరిగణించొచ్చు. అదే విధంగా సీడెడ్ లో 4 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 41 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 37 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్లు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 46 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 17 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 10 లక్షలు, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 34 కోట్ల 46 లక్సహాల రూపాయల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియా+ కర్ణాటక + ఓవర్సీస్+ ఇతర భాషలకు కలిపి 20 కోట్లు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 103 కోట్ల రూపాయిల గ్రాస్, 54 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.