Ghani: పవర్​ఫుల్​ ప్యాక్​తో గని టీజర్​.. వరుణ్​ సిక్స్​ప్యాక్​కు అభిమానులు ఫిదా!

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిస్తోన్న సినిమా గని. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రతి ఒక్కరి కథలో కష్టాలు ఉంటాయి. కన్నీళ్లు ఉంటాయి.. కోరుకలూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై..యూ… ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు..  పవర్​ఫుల్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 15, 2021 11:56 am
Follow us on

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిస్తోన్న సినిమా గని. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రతి ఒక్కరి కథలో కష్టాలు ఉంటాయి. కన్నీళ్లు ఉంటాయి.. కోరుకలూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై..యూ… ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు..  పవర్​ఫుల్​ డైలాగ్​తో ఈ టీజర్ విడుదలైంది.

కిరణ్ కొర్పపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వరుణ్ పూర్తిగా తన లుక్​ను మార్చుకున్నారు. బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ సిక్స్​ప్యాక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. వరుణ్​ అలా కనిపించడానికి వెనక కఠోర శ్రమ దాగి ఉందని సినీ ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది. ఆరడుగులకుపైగా పొడవుతో.. సిక్స్​ప్యాక్​ లుక్​తో అచ్చం హాలీవుడ్​ హీరోను తలపిస్తున్నారు వరుణ్​. ఈ సినిమాలో వరుణ్​కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. సునీల్​ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్​ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్​ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వరుణ్ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముకుంద, కంచె, లోఫర్​, మిస్టర్​, ఫిదా, అంతరిక్షం, ఎఫ్​2 ఇలా చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో తెలియాల్సి ఉంది.