Ghaati Movie Postponed: డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) అనుష్క శెట్టి(Anushka Shetty) తో తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఘాటీ'(Ghaati Movie) జులై 11 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది అని మేకర్స్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు తీసేస్తే సినిమా విడుదలకు సరిగ్గా పది రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ మొదలు అవ్వలేదు. థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. అసలు సినిమా రిలీజ్ జులై 11 న ఉంటుందో లేదో కూడా మేకర్స్ చెప్పలేదు. ఈ పాటికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వాలి. కానీ ఆ ఊసే లేదు. ఇలా ఎటు చూసినా ఈ చిత్రం జులై 11 న విడుదల కాబోతుంది అనే సంకేతాలు అసలు కనిపించడం లేదు. సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉందట.
Also Read: ‘కుబేర’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసిందిగా!
డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మధ్యలో వదిలేసి మరీ ఈ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఆయన 70 శాతం పూర్తి చేసాడు. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో కొంతకాలం ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ సమయంలో ‘ఘాటీ’ చిత్రానికి అప్పటికే యూవీ క్రియేషన్స్ నుండి ఆయన అడ్వాన్స్ తీసుకున్నాడు. అనుష్క డేట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎలాగో ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు కాబట్టి, ఈ చిత్రం నుండి తప్పుకోవడమే ఉత్తమం అని ఆయన ఘాటీ మూవీ కి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన అనుష్క ని ఎంత వయొలెంట్ గా చూపించాడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీజర్ ని చూసిన తర్వాత ఈ చిత్రం పై ట్రేడ్ లో హైప్ కూడా బాగా పెరిగింది.
అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఎట్టి పరిస్థితి లోనూ జులై 11 న విడుదల చేయాలి. లేకుంటే ముందు అనుకున్న డీల్ లో పది కోట్ల రూపాయిల కోత ఉంటుంది. కానీ సినిమా కంటెంట్ మాత్రం సిద్ధంగా లేదు. ఇప్పుడు మూవీ టీం ఏమి చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమాని జులై లోనే విడుదల చెయ్యాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ పట్టుబడితే, తప్పనిసరి పరిస్థితిలో జులై 31 న ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి దీనికి కేవలం వారం రోజుల తేడా మాత్రమే ఉంటుంది. ఒక వారం గ్యాప్ లో క్రిష్ కి సంబంధించిన రెండు సినిమాలు విడుదల అవబోతున్నాయా అంటే అనుమానమే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.