Kannappa Issue: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని మంచు విష్ణు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. బడ్జెట్ కి తగ్గ రేంజ్ లో వసూళ్లు రాకపోయినా, మంచు విష్ణు రేంజ్ కి మించే వసూళ్లు వచ్చాయి. మూడు రోజుల్లో దాదాపుగా 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. నేడు కూడా డీసెంట్ హోల్డ్ ని కనబరిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 1300 కి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే కాసేపటి క్రితమే మంచు విష్ణు వేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘మూవీ లవర్స్ కి ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలని అనుకుంటున్నాను. మా కన్నప్ప చిత్రం పైరసీ కి గురైంది. ఇది నాకు హార్ట్ రప్పించినంత పని అయ్యింది. ఇప్పటి వరకు 30 వేలకు పైగా పైరసీ లింక్స్ ని పట్టుకొని వాటిని డౌన్ చేసాము. పైరసీ చేయడం అనేది దుర్మార్గపు చర్య. వాటిని మనం మన పిల్లలకు నేర్పించము కదా. పైరసీ లో సినిమా చూడడం కూడా అలాంటి దుర్మాగపు చర్య గానే పరిగణింపబడుతుంది. దయచేసి పైరసీ ని ప్రోత్సహించకండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు వేసిన ఈ ట్వీట్ కి ఒక రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి. 30 వేల లింక్స్ ని తొలగించాం అంటున్నావ్, కానీ మూవీ రూల్స్ వెబ్ సైట్ లో సినిమా అలాగే ఉంది. నీ పలుకుబడి ని ఉపయోగించి ఆ సైట్ ని లేపించు చూద్దాం అని కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ‘కన్నప్ప’ విషయం లో మాత్రమే కాదు,ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాకు పైరసీ పెద్ద తలనొప్పి గా మారింది. ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి విడుదల అవుతున్న ప్రతీ సినిమా పైరసీ కి గురి అవుతుంది. థియేటర్ ప్రింట్ అయితే అసలు నిర్మాతలు కూడా పట్టించుకోరు, కానీ థియేట్రికల్ రన్ అయిపోయాక ఓటీటీలో వదిలే క్వాలిటీ కంటెంట్,విడుదల రోజే పైరసీ రూపం లో రావడం సంచలనాత్మకంగా మారింది. నిర్మాతలు ఈ మాఫియా ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ,అవి సఫలం అవ్వడం లేదు. దీనిపై నిర్మాతలందరూ కూర్చొని కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఘోరమైన థియేట్రికల్ రన్స్ ని చూస్తామని చెప్తున్నారు విశ్లేషకులు.