spot_img
Homeఎంటర్టైన్మెంట్Gayatri Raghuram:  బాపు గీసిన బొమ్మలా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే...

Gayatri Raghuram:  బాపు గీసిన బొమ్మలా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు..

Gayatri Raghuram : సినిమాలో ఒక్క చాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీని ఏలుదామని కొందరు అనుకుంటారు. ఆ ఒక్క ఛాన్స్ కోసం పరితపిస్తుంటారు. కొందరు అలా అవకాశం తెచ్చుకొని ఆ తరువాత స్టార్లు అయ్యారు. మరికొందరు స్టార్లు కాకపోయినా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే అందం ఉంటేనే అవకాశాలు ఉంటాయిని కొందరు అంటారు. కానీ అందంతో పని లేకున్నా మంచి నటనతో ఆకట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో బాపు గీసిన బొమ్మ వలే ఓ నటి ఇండస్ట్రీకి వచ్చింది. వచ్చీ రాగానే హిట్టు సినిమాలో నటించింది. ఆ తరువాత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ నటించిన ఈ బాపు బొమ్మ ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పిక్స్ ను చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ?

సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ రావాలంటే గ్లామర్ క్వీన్ అయి ఉండాలని అంటారు. కానీ అచ్చ తెలుగు అమ్మాయిలా, సాంప్రదాయంగా కనిపించే వారికి కూడా అవకాశాలు ఉంటాయని కొందరు నిరూపించారు.ఈ కోవలో సౌందర్య లాంటి వాళ్లు గ్లామర్ కు దూరంగా ఉండి సినీ ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చింది గాయత్రీ రఘురామ్. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ అనే సినిమా పేరు చెప్పగానే ఈ అందాల రాశి గుర్తుకు వస్తుంది. 2010లో విడుదలయిన ఈ సినిమా బంపర్ హిట్టు కొట్టకపోయినా సాంప్రదాయ వాదులు ఆదరించారు. ఇందులోని పాటలకు మంచిస్పందన వచ్చింది.

అయితే గాయత్రి రఘురామ్ 2001లోనే ‘రేపల్లెలో రాధ’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2003లో ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ సినిమాలో నటించడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన తరువాత గాయత్రి రఘురామ్ కు అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించింది. అయితే ఆ తరువాత సినిమా ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2004 నుంచి 2010 వరకు ఏ సినిమాల్లో నటించలేదు.

దీంతో గాయత్రి రఘురామ్ 2006లో అమెరికాకు చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్లు వీరు కలిసి ఉన్నా.. ఆ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో 2010లో విడాకులు తీసుకున్నారు. సినిమాల్లో అవకాశాలలు లేకపోవడంతో రాజకీయాల వైపు వెళ్లారు గాయత్రి రఘురామ్. 2014లో బీజేపీలో చేరిన ఆమె ఇటీవలే బయటకు వచ్చింది. అయితే ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ సినిమాలో బాపు బొమ్మలా ఉన్న ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ప్రస్తుతం అందం గురించి పట్టించుకోకుండా తన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version