Realme 13Pro: భారత మార్కెట్ లోకి రియల్ మీ 13 ప్రో.. ధర, ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

రియల్ మీ 13 ప్రో ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ మార్కెట్లో అందుబాటులో వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో కూడా ఈ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు.

Written By: Neelambaram, Updated On : August 28, 2024 2:17 pm

Realme 13Pro

Follow us on

Realme 13Pro: రియల్ మీ 13 ప్రో ఎడిషన్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి వచ్చేసింది. అనేక గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్స్ తో ఈ మోడల్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నది. ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4 స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులోకి వస్తున్నది. ఇక ఈ ఎడిషన్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ, ఓఎల్ఈడీ డిసిప్లే ను కలిగి ఉంటుంది. రియల్ మీ 13 , 13 ప్లస్ ప్రో మోడల్ చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇక రియల్ మీ 13 ప్రో ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ క్వాల్కమ్ మొక్క స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్ తో పాటు 12 జీబీ RAM తో పనిచేస్తుంది. ఇది 45 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే గణనీయమైన 5200ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఫోన్ రేర్ కెమెరా సెటప్ తో తయారు చేశారు. అదనపు భద్రత కోసం ఆఫ్టికల్ ఇన్ డిసిప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. కొనుగోలు దారులు ఈ ఫోన్ కోసం సొగసైన గాజు, మరో వేరియంట్ మోడల్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. చైనాలో రియల్ మీ 13 ప్రో ఎక్స్ ట్రీం ఎడిషన్ 12 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ. 24,700 గా ధర నిర్ణయించారు. 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్న హైఎండ్ వేరియంట్ ధర రూ. 28,300 కి అందుబాటులో ఉంది. లేత పచ్చ రంగు, పర్పుల్ సహా ఇతర రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. రియల్ మీ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా నేరుగా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ 13 ప్రో ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ 6.7 అంగుళా పూర్తీ హెచ్డీతో పాటు ఓఎల్ఈడీ డిసిప్లేను కలిగి ఉంది. ఇది 1080*2412 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెచ్జే రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. సురక్షితమైన వీక్షణ కోసం ఎస్జేఎస్ ఏఐ సర్టిఫికేషన్ తో ఈ ఫోన్ అందుబాటులో కి వస్తున్నది. స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ చిప్ సెట్ ను కలిగి ఉంది. అండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే రియల్ మీ యూఐ 5.0తో ఈ ఫోన్ ఉంటుంది. ఇక ఫొటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నవారు డ్యుయెల్ కెమెరా ను చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.

ఇందులో సోనీ(ఎల్ వైటీ-600) నుంచి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్ అద్భుతమైన ఫీచర్ అందజేస్తుంది.

ఈ ఫోన్ 5జీ, 4 జీ ఎల్ టీఈ, వైఫై, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, బ్లూటూత్ 5.2, యూఎస్ బీ టైప్ సీ పోర్ట్ తో సహా వివిధ కనెక్టివిటీ ఎంపికలకు మద్దతు ఇస్తుంది. అదనంగా ఇది ఐపీ65 రేటింగ్ ను కలిగి ఉంది. దుమ్ము, నీటి స్ల్పాష్ లకు నిరోధకతను అందిస్తున్నది. మన్నిక కోసం ఎస్జీఎస్ యాంటీ డ్రాప్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. రియల్ మీ 13 ప్రో ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ కొలతలు మోడల్ ను బట్టి మారుతూ ఉంటాయి.

మోనెట్ పర్పుల్ లో గ్లాస్ వేరియంట్ 161.34*73.91*8.23 మి.మీ, బరువు 188 గ్రా ఉంటుంది. ఇక వేగన్ లెదర్ బ్యాక్ తో లేక్ గ్రీన్ వెర్షన్ 8.41 మిమీ వద్ద కొద్దిగా మందంగా ఉంటుంది. అయితే బరువు మాత్రం తేలికగా 183.5 గ్రాములు ఉంటుంది.