Gautham Tinnanuri : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు రజినీకాంత్ (Raninikanth)…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రోబో (Robho) సినిమాతో మొదటి పాన్ ఇండియా సినిమాను చేసిన హీరో కూడా తనే కావడం విశేషం. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి అప్పట్లో 400 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక రోబో 2 (Robo 2) సినిమాతో 600 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraj) దర్శకత్వంలో కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద తమిళ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే రజినీకాంత్ మేనియా అనేది మరోసారి ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ కొత్త కథలను వింటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రామ్ చరణ్ చేసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమాలు ఇవేనా..?
ఇప్పటికే అతనికి వివేక్ ఆత్రేయ (Vivek Athreya), గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanuri) లాంటి ఇద్దరు తెలుగు యంగ్ డైరెక్టర్లు కథలను వినిపించినట్టుగా తెలుస్తోంది. అందులో ఆయన ఎవరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది క్లారిటీగా తెలియడం లేదు. కానీ మొత్తానికైతే గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకి తను చాలా బాగా ఎంగేజ్ అయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో కింగ్ డమ్ (Kingdom) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చేనెల మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ ను సాధిస్తే రజినీకాంత్ గౌతమ్ తిన్ననూరి (Goutham తిన్నాను) తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ కి పాన్ ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ అయితే ఉంది. ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తే ఆయన మార్కెట్ అనేది అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి రజనీకాంత్ కూడా అతనికి అవకాశాలు ఇచ్చే ఛాన్సులైతే ఉన్నాయి.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?