NTR Birthday: నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం నేడు. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. వరల్డ్ వైడ్ ఎన్టీఆర్ అభిమానులు బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిత్ర ప్రముఖులు ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరింత స్పెషల్ గా ఎన్టీఆర్ ని విష్ చేశారు.
Also Read: ఛత్రపతి హిందీ అందుకే ప్లాప్, ఎట్టకేలకు ఓపెన్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
”హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ బావా.. నీవు సుఖ సంతోషాలు, విజయాలు పొందాలని ఆశిస్తున్నాను” అని అల్లు అర్జున్ ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో కామెంట్ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ హార్ట్ టచింగ్ విషెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్-అల్లు అర్జున్ మ్యూచువల్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ కి సంబంధించిన అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్-అల్లు అర్జున్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ సైతం ప్రతి అల్లు అర్జున్ బర్త్ డేకి విషెస్ తెలియజేస్తాడు. వీరు ఒకరినొకరు బావా అని సంబోధించుకుంటారు.
ఇక ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వార్ 2 టీజర్ విడుదల కానుంది. దాని కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న హృతిక్ రోషన్ దీనిపై స్పెషల్ గా స్పందించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ హిందీ చిత్రం వార్ 2 కావడం విశేషం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ 2 తెరకెక్కుతుంది.
అయితే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేదని తెలుస్తుంది. కనీసం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన నేపథ్యంలో నో అప్డేట్ అంటున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.
Happy Birthday Bava @tarak9999 !
Wishing you all the success , Joy & Happiness— Allu Arjun (@alluarjun) May 20, 2025