Bigg Boss Telugu 8: ఆడియన్స్ కి ఏ మాత్రం పరిచయం లేకుండా హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, పేరు మోసిన సెలెబ్రిటీలను దాటుకుంటూ ముందుకు వెళ్లి, చివరి వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో ప్రయాణం చెయ్యాలంటే, ఆ కంటెస్టెంట్ కి ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉండాలి. అలా గత సీజన్ లో మన అందరికీ అనిపించిన కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు ఈయన పేరు కనీసం సోషల్ మీడియా ఆడియన్స్ కి కూడా తెలియదు. అంతటి చిన్న ప్రొఫైల్ తో అడుగుపెట్టిన ఈయన మొదటి వారం లోనే తన మార్కు ఏంటో చూపించి ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు. అలా మొదటి వారం తోనే తన ఆట ద్వారా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న గౌతమ్, 13 వారాలు హౌస్ లో కొనసాగాడు.
ఇది మామూలు విషయం కాదు. టాప్ 5 లోకి కచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ, కొద్దిగలో మిస్ అయ్యింది. ఈ సీజన్ లో ఆయన గత సీజన్ లో లాగానే తన మార్కు ని చూపిస్తే టాప్ 5 లోకి రావడమే కాకుండా, టైటిల్ ని గెలిచే అవకాశం కూడా ఉంటుంది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే అతి కష్టమైన టాస్క్ ని చాలా తేలికగా ఆడి గెలిచాడు గౌతమ్. అయితే ఈసారి ఆయన హౌస్ లోకి అడుగుపెట్టగానే మణికంఠ, యష్మీ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. మణికంఠ డ్రామాలు ఎవరి వద్దనైనా వర్కౌట్స్ అవ్వొచ్చు ఏమో కానీ, గౌతమ్ వద్ద మాత్రం అవ్వవు. నామినేషన్స్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఫైటింగ్ జరిగితే ఎలా ఉంటుందో చూసేందుకు ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గౌతమ్ కి ఇది రెండవ రీ ఎంట్రీ అని చెప్పొచ్చు.
సీజన్ 7 లో ఆయన సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి, మళ్ళీ హౌస్ లోకి ‘అశ్వద్ధామ 2.0’ గా అడుగుపెట్టిన తీరు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక చరిత్ర అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ గత సీజన్స్ లో కూడా సీక్రెట్ రూమ్స్ ఉండేవి కానీ, గత సీజన్ లో సీక్రెట్ రూమ్ మాత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఇప్పడు గౌతమ్ ఈ సీజన్ లో రీ ఎంట్రీ ని ‘అశ్వథామ 3.0’ గా చూడొచ్చు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత గౌతమ్ కి కొన్ని మెడిసిన్స్ ని కంటెస్టెంట్స్ కి ఇవ్వమంటాడు బిగ్ బాస్. ఆ మెడిసిన్స్ పైన కొన్ని నెగటివ్ పేర్లు ఉంటాయి. యష్మీ కి ‘స్వార్థపరురాలు’ అనే మెడిసిన్ ఇస్తాడు. ‘సరే..గుర్తుపెట్టుకుంటా’ అని గౌతమ్ కి యష్మీ వార్నింగ్ ఇస్తుంది. ఇక మణికంఠ కి ఆయన ‘అతి గా ఆలోచించకు’ అనే ట్యాగ్ ఇస్తాడు. రేపటి నుండి గౌతమ్ ఎలా గేమ్ ఆడుతాడో చూడాలి.