https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : 6వ వారంలో నామినేషన్స్ కి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే .. యష్మీ ని దారుణంగా టార్గెట్ చేసిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్!

మొదటి రెండు వారాలు ఆడియన్స్ కి చూపించిన సీతని మళ్ళీ చూపిస్తే మాత్రం టాప్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం యష్మీ నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమెకు ఓటింగ్ బాగా పడుతున్నట్టు సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2024 / 09:10 AM IST

    Bigg Boss 8 Telugu 6th week nominations

    Follow us on

    Bigg Boss Telugu 8 : ప్రతీ వారం బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే అది నామినేషన్స్ ఎపిసోడ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ, గొడవలు వేసుకుంటూ ఉంటారు. టీఆర్ఫీ రేటింగ్స్ ప్రతీ వారం వీకెండ్ ఎపిసోడ్స్ కంటే నామినేషన్స్ ఎపిసోడ్స్ కి ఎక్కువ వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆడియన్స్ ఎంతలా ఈ ఎపిసోడ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు అనేది. అయితే ఈ 5 వారాలు జరిగిన నామినేషన్స్ వేరు, ఈరోజు జరగబోయే నామినేషన్స్ వేరు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నిన్ననే జరిగింది కానీ, టెలికాస్ట్ అయ్యేది మాత్రం నేడు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ టాస్కులు రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్) గెలవడం తో, ఓజీ క్లాన్ (పాత కంటెస్టెంట్స్) కి నామినేట్ చేసే అవకాశం లేదని చెప్తాడు బిగ్ బాస్.

    దీంతో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ నామినేషన్స్ మొదలు పెడుతారు. ఎక్కువ శాతం మంది యష్మీ కి నామినేషన్స్ వేస్తారు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో ప్రసారం చేసిన ప్రోమోలో హరితేజ యష్మీకి, పృథ్వీ రాజ్ కి నామినేషన్ చేస్తుంది. ఆ తర్వాత టేస్టీ తేజా నామినేషన్స్ వెయడాన్ని మనకు ప్రోమో లో చూపిస్తారు. విష్ణు ప్రియ, యష్మీ, సీత మరియు పృథ్వీ ని నామినేట్ చేస్తారు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్. అయితే చివర్లో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ‘ఓజీ’ క్లాన్ సభ్యులు మొత్తం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని ఎంచుకొని నామినేట్ చేయమని అంటాడు బిగ్ బాస్. ఓజీ క్లాన్ సభ్యులు మొత్తం చర్చించుకొని మెహబూబ్, గంగవ్వ ని నామినేట్ చేస్తారు. అలా ఓజీ క్లాన్ నుండి నలుగురు, రాయల్ క్లాన్ నుండి ఇద్దరు, మొత్తం మీద 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో సోషల్ మీడియా పొలింగ్స్ ప్రకారం గంగవ్వ అందరికంటే టాప్ స్థానంలో కొనసాగుతుంది.

    ఆ తర్వాతి స్థానంలో విష్ణు ప్రియ కొనసాగుతుండగా, మూడవ స్థానం లో యష్మీ కొనసాగుతుంది. ఇక నాల్గవ స్థానం లో మెహబూబ్ కొనసాగుతుండగా, ఐదవ స్థానం లో పృథ్వీ, అలాగే చివరి స్థానం లో సీత కొనసాగుతుంది. వీరిలో సీతకు, పృథ్వీ కి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వారం ఆమె టాస్కులు బాగా ఆడుతూ, మొదటి రెండు వారాలు ఆడియన్స్ కి చూపించిన సీతని మళ్ళీ చూపిస్తే మాత్రం టాప్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం యష్మీ నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమెకు ఓటింగ్ బాగా పడుతున్నట్టు సమాచారం.