https://oktelugu.com/

బిగ్‌ బాస్ కి లౌక్యం చూపిస్తోన్న గంగవ్వ !

బిగ్‌బాస్ 4 సీజన్‌ లో అత్యంత ప్రజాధరణ పొందుతున్న సెలెబ్రిటీ ఎవరన్నా ఉన్నారు అంటే.. ఆమె గంగవ్వనే. మొత్తానికి గంగవ్వను షోలో తీసుకోవడం గంగవ్వకు కంటే కూడా, షోకే ఎక్కువ ప్లస్ అవుతుంది. షోలో ఏమైనా విషయం తగ్గినట్టు అనిపించగానే బూస్టప్ చేసేందుకే గంగవ్వ రెడీగా ఉంటుంది. పైగా తెలంగాణ యాసలో గంగవ్వ చెప్పే డైలాగ్ లు కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. దీనికితోడు గంగవ్వ ఫాలోయింగ్ అండ్ క్రేజ్ కూడా రోజురోజుకూ బాగా పెరిగిపోతొంది. నిజానికి […]

Written By:
  • admin
  • , Updated On : September 12, 2020 / 06:47 PM IST
    Follow us on


    బిగ్‌బాస్ 4 సీజన్‌ లో అత్యంత ప్రజాధరణ పొందుతున్న సెలెబ్రిటీ ఎవరన్నా ఉన్నారు అంటే.. ఆమె గంగవ్వనే. మొత్తానికి గంగవ్వను షోలో తీసుకోవడం గంగవ్వకు కంటే కూడా, షోకే ఎక్కువ ప్లస్ అవుతుంది. షోలో ఏమైనా విషయం తగ్గినట్టు అనిపించగానే బూస్టప్ చేసేందుకే గంగవ్వ రెడీగా ఉంటుంది. పైగా తెలంగాణ యాసలో గంగవ్వ చెప్పే డైలాగ్ లు కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. దీనికితోడు గంగవ్వ ఫాలోయింగ్ అండ్ క్రేజ్ కూడా రోజురోజుకూ బాగా పెరిగిపోతొంది. నిజానికి షోలో పార్టిసిపేట్ చేయక ముందే గంగవ్వకు ఎంతో క్రేజ్ ఉంది. ఆమెలోని మట్టి వాసనకు, తెలంగాణ యాసకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

    Also Read: జైలు అప్డేట్ :పాపం రియాకు దిండు కూడా గతిలేదా?

    అందుకే ఎక్కువుగా గంగవ్వను బేస్ చేసుకునే ప్రోమోలను కూడా వదులుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొదటి రెండు రోజులు బిగ్‌బాస్ ప్రోమోలు గంగవ్వ మీదే వచ్చాయి, పైగా వాటికి వ్యూస్ కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. అందుకే ఆమె వేసే డైలాగ్‌లను ప్రత్యేకంగా ‘స్టార్ మా’ వారే మీమ్స్ టైప్‌ లో ఎడిట్ చేసి వదులుతున్నారు. అయితే గంగవ్వ మాత్రం మాట మార్చేస్తోంది. గంగవ్వకు గేమ్ ప్లాన్స్, స్ట్రాటజీలు వంటివి ఏమీ తెలియకపోయినా.. లౌక్యం బాగానే చూపిస్తోంది. కట్టప్ప విషయంలో గంగవ్వ మాట మార్చేసింది. కట్టప్ప కోసం మూడు టాస్కులు పెట్టగా గంగవ్వ మాట మార్చేసింది.

    Also Read: మరో గొప్ప ప్రయత్నం చేస్తున్న సోనూసూద్

    మొదటి సారి, కార్డ్‌ పై పేరు రాసేటప్పుడు అఖిల్‌ను కట్టప్పగా చెప్పుకొచ్చింది. రెండో సారి ఆరియానా, సోహెల్‌కు కట్టప్ప గురించి వివరిస్తూ మళ్ళీ అఖిల్ పేరునే కట్టప్పగా చెప్తూ.. తాను అందరిలా మాట మార్చనని, మార్చితే అది లంగతనమైతది అని పెద్దావిడ పెద్ద మాటనే చెప్పింది. అఖిల్ రాత్రంతా మేల్కొని అందరిని చూసుకుంటూ, జాగ్రత్తగా కాపాడుతాడంటూ మొత్తానికి అఖిల్‌ ను కట్టప్పను చేసింది గంగవ్వ. మళ్ళీ అంతలోనే మాట మార్చేసింది. ప్రస్తుతం తన దృష్టిలో కట్టప్ప అంటే అమ్మ రాజశేఖర్ అంటూ ఆయనగారికి కట్టప్ప స్టాంప్ వేసేసింది. ఏది ఏమైనా గంగవ్వ బిగ్‌బాస్ కి బాగానే లౌక్యం చూపిస్తోంది.