వైసీపీ టీడీపీ దొందూ దొందే…. ఇవే సాక్ష్యాలు….?

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీ నచ్చదు. అయితే పైకి ఒక పార్టీకి మరొక పార్టీ మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో అంతర్గతంగా ఒక పార్టీకి మరొక పార్టీ సహకరించుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీలను పరిశీలిస్తుంటే పైకి శత్రువుల్లా కనిపిస్తున్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయా….? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ ఎన్నికల కమిషనర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 12, 2020 7:33 pm
Follow us on


ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీ నచ్చదు. అయితే పైకి ఒక పార్టీకి మరొక పార్టీ మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో అంతర్గతంగా ఒక పార్టీకి మరొక పార్టీ సహకరించుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీలను పరిశీలిస్తుంటే పైకి శత్రువుల్లా కనిపిస్తున్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయా….? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ద రమేష్ కుమార్ కొన్ని నెలల క్రితం బీజేపీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని వీడియోలు వస్తాయని… టీడీపీతో సన్నిహితంగా ఉండే బీజేపీ నేతలకు ఎన్నికల కమిషనర్ తో పని ఏంటని… బాబు గారి బండారం త్వరలో బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆ తరువాత ఆ వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియదు. తాజాగా జరిగిన అంతర్వేది రథం ఘటన విషయంలో విజయసాయిరె్డ్ది చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినా అందుకు తగిన సాక్ష్యాలను చూపించలేకపోయారు. టీడీపీపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా సాక్ష్యాలను చూపించడంలో మాత్రం విఫలమవుతూ ఉండటం గమనార్హం.

అయితే గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాసిన సమయంలో, ఈ.ఎస్.ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పేరు వెలుగులోకి వచ్చిన సమయంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. అమరావతి లక్ష కోట్ల కుంభకోణమని ఆరోపణలు చేసినా వైసీపీ వాటిని నిరూపించలేకపోయింది. గతంలో టీడీపీ సైతం వైసీపీపై ఇలాంటి ఆరోపణలు చేసినా ప్రూవ్ చేయలేకపోయింది. దీంతో వైసీపీ టీడీపీ ఒక అవగాహనతో పని చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.