https://oktelugu.com/

Rajinikanth: రజినీ కాంత్ చివరి సినిమా అదేనా..?ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయడం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరోలైతే ఉన్నారో అందుకు దీటుగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడు ఉండటం విశేషం...ముఖ్యంగా ఇక్కడ మనం చిరంజీవిని ఎలా అయితే మెగాస్టార్ గా పిలుచుకుంటామో అక్కడ రజనీకాంత్ కూడా సూపర్ స్టార్ గా చాలా సంవత్సరాల నుంచి వెలుగొందుతుండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 10:05 AM IST

    Rajinikanth(3)

    Follow us on

    Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏలుతున్న ఏకైక హీరో రజనీకాంత్… ఆయనను మించిన నటుడు లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆయన స్టైల్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు. ఆయన సినిమాని చూసి ఆనందపడని అభిమాని లేడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం రజనీకాంత్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ‘వేట్టయన్ ‘ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. ఇక ప్రస్తుతం కూలీ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి లోకేష్ కనకరాజు డైరెక్టర్ కావడంతో సినిమా మీద భారీ హైప్ ఐతే క్రియేట్ అవుతుంది. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.అందుకే ఈ మూవీ మీద చాలా కసరత్తులు చేస్తున్నాడు. విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ ప్రస్తుతం 73 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి ఆయనకు హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తను సినిమాలకు రిటర్ మెంట్ ప్రకటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఆయన నెల్సన్ తో చేస్తున్న జైలర్ 2 సినిమానే ఆయనకు చివరి సినిమా అంటూ కొంతమంది సినీ మేధావులు అలాగే రజనీకాంత్ సన్నిహితులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం…

    ఇక ప్రస్తుతానికి ఆయన సినిమాల్లో హీరోగా కాకుండా ఒక మంచి క్యారెక్టర్ దొరికితే నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి రజనీకాంత్ లాంటి నటుడుని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి అతని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఆయన సినిమాలు చేయడం మానేస్తే తన అభిమానులు ఎలా ఫీలవుతారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

    ఇక ఇన్ని సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రేక్షకులను అలరించిన ఆయన సినిమాలకు రెస్ట్ ఇవ్వడం పట్ల పలు రకాల కథనాలైతే వెలువడుతున్నాయి. మరి రజనీకాంత్ అఫీషియల్ గా అయితే ఏ నిర్ణయాన్ని తెలియజేయలేదు. ఇక అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆయన సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది…