https://oktelugu.com/

Manchu Vishnu Jinnah Movie: జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!

Manchu Vishnu Jinnah Movie: విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే […]

Written By:
  • admin
  • , Updated On : June 21, 2022 / 03:42 PM IST
    Follow us on

    Manchu Vishnu Jinnah Movie: విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా, ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ‘జిన్నా’ లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

    Vishnu, Ganesh Master

    విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పార్టీ సాంగ్ కి గణేష్ ఆచార్య స్టెప్స్ సమకూర్చారు. ఎంగేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం.

    Sunny Lenon, Vishnu, Payal

    Also Read: Open Auction Rajiv Swagruha Plots: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడు సూడలే!

    ప్రభుదేవా, గణేష్ ఆచార్య తో పాటు ఈ సినిమా కోసం డ్యాన్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా లీడ్ పెయిర్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు…’ పాట కోసం డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన స్టెప్స్ కి ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రముఖ డ్యాన్సర్స్ ‘జిన్నా’ పాటలకు కొరియోగ్రఫీ సమకూర్చడం సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.

    Prem Rakshit

    డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

    Also Read: Ram Charan In Salman Khan Movie: సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్

    Tags