https://oktelugu.com/

Comedian Brahmanandam: టాలెంట్ కి మించి ఆ ఒక్క లక్షణం బ్రహ్మానందానికి తిరుగులేని సక్సెస్ అందించింది!

Comedian Brahmanandam: నవ్వుల చిరునామా బ్రహ్మానందం గురించి చెప్పాలంటే పదాలు చాలవు, రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఈ శతాబ్దంలో ఆయన ఓ సక్సెస్ఫుల్ కమెడియన్. మూడు దశాబ్దాలకు పైగా నవ్విస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం నడిచినా నిలుచున్నా… మాట్లాడినా మౌనంగా ఉన్నా… పాట పాడినా ఫైట్ చేసినా.. కామెడిగానే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఏం చేసినా కామెడీనే. నవ్వు ఎప్పుడూ ఆయన ముఖం మీదే ఉంటుంది. ఆయన్ని చూస్తున్న వాళ్ళను ఆవహిస్తుంది. వేల చిత్రాల్లో నటించి గిన్నిస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 21, 2022 / 03:36 PM IST

    Brahmanandam

    Follow us on

    Comedian Brahmanandam: నవ్వుల చిరునామా బ్రహ్మానందం గురించి చెప్పాలంటే పదాలు చాలవు, రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఈ శతాబ్దంలో ఆయన ఓ సక్సెస్ఫుల్ కమెడియన్. మూడు దశాబ్దాలకు పైగా నవ్విస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం నడిచినా నిలుచున్నా… మాట్లాడినా మౌనంగా ఉన్నా… పాట పాడినా ఫైట్ చేసినా.. కామెడిగానే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఏం చేసినా కామెడీనే. నవ్వు ఎప్పుడూ ఆయన ముఖం మీదే ఉంటుంది. ఆయన్ని చూస్తున్న వాళ్ళను ఆవహిస్తుంది. వేల చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న బ్రహ్మానందం అనేక పురస్కారాలు, గౌరవాలు, సన్మానాలు అందుకున్నారు. వీటన్నింటికీ మించిన ప్రేక్షకుల ప్రేమను ఆయన సొంతం చేసుకున్నారు. ప్రతి స్టార్ హీరోకి అభిమానులు ఉంటారు. కానీ అందరి స్టార్ హీరోల ఫ్యాన్స్ బ్రహ్మానందం అభిమానులై ఉంటారు.

    Brahmanandam

    బ్రహ్మానందం ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారణం ఏమిటీ? ఆయన గొప్ప నటన, హావభావాలు… అందులో సందేహమే లేదు. అయితే అంతకు మించిన లౌక్యం ఆయనకు పరిశ్రమలో తిరుగులేకుండా చేసింది. చిత్ర పరిశ్రమలో ఇగోలు, పట్టింపులు చాలా ఎక్కువ. మనుషుల మనస్తత్వాన్ని బట్టి నడుచుకోవాలి. ముక్కుసూటిగా ఉంటానంటే కుదరదు. లౌక్యం తెలియని వాళ్లకు ఎంత టాలెంట్ ఉన్నా పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండలేరు. ఒక్కసారి చెడ్డపేరు తెచ్చుకుంటే, ఎదగడం కష్టం.

    Also Read: Ram Charan In Salman Khan Movie: సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్

    ఈ విషయంలో బ్రహ్మానందం దిట్ట. దర్శకులను, నటులను, నిర్మాతలను హీరోలను ఆయన చదివేశారు. ఏ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. వయసు, సీనియారిటీ, స్టార్డం అనే పట్టింపులు లేకుండా బ్రహ్మానందం అందరితో కలిసిపోయి నటిస్తారు. ఓ డెబ్యూ హీరోతో అయినా చెంపదెబ్బలు కొట్టించుకుంటారు. ఎందుకంటే అతడు హీరో తాను కమెడియన్ అని నమ్ముతారు. ఆయనకు ఇమేజ్ పట్టింపులు ఉండవు. పాత్రనే ఫాలో అవుతారు. సాధ్యమైనంత వరకు గొప్పగా చేసి నవ్వించాలనుకుంటారు.

    Comedian Brahmanandam

    ఈ లక్షణాలు బ్రహ్మానందంని టాలీవుడ్ తిరుగులేని కమెడియన్ గా మార్చాయి. ఇన్నేళ్లలో ఆయన విరామం తీసుకుంది లేదు. బడా హీరో కంటే ఎక్కువ సంపాదన ఆయన సొంతం. కరోనా రాకముందు బ్రహ్మానందం అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. కోలుకున్నాక సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాల్లో బ్రహ్మానందం ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్నారు.

    Also Read:Mallemaala Entertainments: వాడుతున్న ‘మల్లె’ దండ.. వీడుతున్న నట పుష్పాలు

    Tags