Game Changer : #RRR తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) నుండి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన కళ్లారా చూసాము. అభిమానులకు ఈ సినిమా ఒక పీడకల లాంటిది. సినిమాలో ఒక్కటంటే ఒక్క అదిరిపోయే ఎలివేషన్ సన్నివేశం లేకపోవడమే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణమని విశ్లేషకుల అభిప్రాయం. రామ్ చరణ్ IAS ఆఫీసర్ గా, అదే విధంగా ఆపన్న క్యారక్టర్ లో అద్భుతంగా నటించాడని, కానీ ఆయన పొటెన్షియల్ ని డైరెక్టర్ శంకర్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడని అంటున్నారు. అయితే ఎల్లప్పుడూ మెగా ఫ్యామిలీ పై సెటైర్లు వేస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా ప్లాప్ అవ్వడం గురించి పలు కీలక విశ్లేషణలు చేసాడు.
Also Read : అమెజాన్ ప్రైమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన దిల్ రాజు..’గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ విడుదల అయ్యేది ఆ ఓటీటీ లోనే!
ఆయన మాట్లాడుతూ ‘శంకర్(Shankar Shanmugham) సినిమా అంటే ఒక బ్రాండ్. గత రెండు చిత్రాలను పక్కన పెడితే గతంలో ఆయన సినిమాల్లో ఎదో ఒక కొత్త అంశం జనాలను ప్రత్యేకంగా ఆకర్షించేది. తీసేది సాధారణమైన కమర్షియల్ సినిమాలే, కానీ వాటిల్లో ఆయన పెట్టే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆ సినిమాలను మరో లెవెల్ కి తీసుకెళ్ళేవి. ఉదాహరణకు అపరిచితుడు లో మల్టీ పర్సనాలిటీ, రోబో లో ఒక మర మనిషి అమ్మాయిని ప్రేమించడం ఇలా ఎదో ఒక కొత్త అంశం ఉండేది. కానీ ‘గేమ్ చేంజర్’ లో అలాంటివేమీ లేవు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది’ అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. శంకర్ సినిమాల్లో జనాలు ఇలాంటివే ఆశిస్తారని, కానీ ఆయన రోబో తర్వాత కొత్తగా అలోచించి సినిమాలు చేయడం లేదు. అందుకే వరుస ఫ్లాప్స్ ఎదురు అవుతున్నాయి అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే సమయానికి ఆరు గంటల ఫుటేజీ వచ్చిందట. అంటే శంకర్ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేదు. తోచింది తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మంచి కథ ని డైరెక్టర్ శంకర్ తన టేకింగ్ తో అతి చెత్తగా తీశాడని, సినిమా మొత్తం అతుకుల బొంత లాగా ఉందని, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి అసలు కనెక్షన్ లేదని విడుదల సమయంలో అందరూ ఈ చిత్రాన్ని తిట్టారు. కనీసం ఓటీటీ లో అయినా తొలగించిన సన్నివేశాలను జత చేసి అప్లోడ్ చేసి ఉండుంటే బాగుండేది అనే అభిప్రాయలు కూడా వ్యక్తం అయ్యాయి. శంకర్ తన పద్దతి ని మార్చుకోకపోతే ఒకప్పుడు శంకర్ అని మాట్లాడుకోవాల్సిన రోజులు వస్తాయని అంటున్నారు. వింటేజ్ శంకర్ ఇక బయటకి రావడం కూడా కష్టమే అని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.
Also Read : గేమ్ చేంజర్’ తో మోసపోయాం..దిల్ రాజు మాకు డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టిస్టులు!