Game Changer First Review: ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య ఒకింత నిరాశపరిచింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ రామ్ చరణ్ ని వెంటాడింది. గేమ్ ఛేంజర్ మూవీతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ భారీ ఎత్తున విడుదల కానుంది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్రణాళికలు వేశారు. విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ ని, ఆ డేట్ కి విడుదల చేస్తున్నారు. జనవరి 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.
దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ప్లాష్ బ్యాక్ లో చరణ్ ఒక నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. సమకాలీన పాత్రలో ఆయన ఐఏఎస్ అధికారి అట. ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. గేమ్ ఛేంజర్ డల్లాస్ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ దక్కింది.
కాగా ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. ఆయన గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చారు. చిరంజీవితో కలిసి గేమ్ ఛేంజర్ ఫస్ట్ కాపీ సుకుమార్ చూశాడట. మూవీ ఎలా ఉందో? హైలెట్స్ ఏమిటో? డల్లాస్ ఈవెంట్ లో ఆయన వెల్లడించారు. ఫస్ట్ హాఫ్ అస్సాం అట, ఇంటర్వెల్ బ్యాంగ్ బ్లాక్ బస్టర్ అట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ రేపుతాయట. ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన ఫీక్స్ అట. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని సుకుమార్ భావించారట.
అప్పుడు మిస్ అయిన నేషనల్ అవార్డు గేమ్ ఛేంజర్ మూవీతో రామ్ చరణ్ సాధిస్తాడని సుకుమార్ అన్నారు. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని సుకుమార్ తన అభిప్రాయం ఓపెన్ గా పంచుకున్నాడు. సుకుమార్ రివ్యూ ప్రకారం మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా హైలెట్. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో భారీ హిట్ ఖాతాలో వేసుకోనున్నాడు.
దిల్ రాజు దాదాపు రూ. 300 బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.