https://oktelugu.com/

Sobhita Dhulipala: సమంత విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు.. శోభితకు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన సీరియస్ కండిషన్ ఇదే!

ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో నాగ చైతన్యకు మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. వీరి విడాకులకు కారణాలు ఇవే అంటూ చాలా పుకార్లు చక్కర్లు కొట్టాయి. శోభిత ధూళిపాళ్లను నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. కాగా సమంత విషయంలో జరిగిన తప్పుడు శోభిత విషయంలో జరగకూడదని అక్కినేని ఫ్యామిలీ ఫిక్స్ అయ్యిందట. అందుకు ఒక సీరియస్ కండిషన్ పెట్టిందట.

Written By:
  • S Reddy
  • , Updated On : December 22, 2024 / 06:35 PM IST

    Sobhita Dhulipala

    Follow us on

    Sobhita Dhulipala: టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన అప్పట్లో ఒక సంచలనం. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని నాగ చైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. దాదాపు 4 ఏళ్ళు అన్యోన్యంగా వీరి కాపురం సాగింది. సమంతతో నాగ చైతన్యకు మనస్పర్థలు తలెత్తడానికి కారణాలు ఇవే అంటూ.. పలు వాదనలు తెరపైకి వచ్చాయి. ఎక్కువగా సమంత ఆరోపణలు ఎదుర్కొంది. ఆమెపై అనేక అపవాదులు గుప్పించారు.

    ముఖ్యంగా వినిపించిన కారణం… సమంత బోల్డ్ రోల్స్ చేయడమే. సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రాజెక్ట్స్ లో సమంత బెడ్ రూమ్ సీన్స్ చేసింది. టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటిగా ఉంది. అక్కినేని వారి కోడలు ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఏమిటనే విమర్శలు వినిపించాయి. ఇండిపెండెంట్ గా సమంత, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించకుండా సొంత నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు ఉన్నాయి. నటించడానికి అనుమతి తీసుకుని ఆమె బోల్డ్ రోల్స్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

    కాబట్టి శోభిత విషయంలో ఈ తప్పు జరగకూడదని అక్కినేని ఫ్యామిలీ భావిస్తుందట. నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే చేస్తున్న సబ్జెక్ట్స్, రోల్స్ ఎలాంటివితో నాగ చైతన్యకు చెప్పి, అనుమతి ఇచ్చాకే సైన్ చేయాలని కండిషన్ పెట్టారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత.. తెలుగులో మాట్లాడాలని నాగ చైతన్య కోరుకునేవాడని చెప్పింది.

    ఈ కండిషన్ సమంతకు కూడా నాగ చైతన్య పెట్టి ఉంటాడని కొందరు అంచనా వేస్తున్నారు. సమంతకు తెలుగు వచ్చు కానీ.. మరీ ఫ్లూయెంట్ కాదు. ఆమె చెన్నై అమ్మాయి కావడంతో ఇంగ్లీష్, తమిళ్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఇక శోభిత అచ్చు తెలుగు అమ్మాయి. కానీ ఆమె కెరీర్ ముంబైలో మొదలైంది. అందుకే ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుందట. అందుకే నాగ చైతన్య తెలుగులో మాట్లాడాలని ప్రత్యేకంగా అడిగేవాడట.