https://oktelugu.com/

Allu Arjun : పిల్లల్ని ఇంటి నుండి పంపేసిన అల్లు అర్జున్..భయానక వాతావరణం లో అల్లు అర్జున్ ఇల్లు..వైరల్ అవుతున్న వీడియో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గోడని దూకి లోపలకు వెళ్లి, అడ్డుకున్న సెక్యూరిటీ ని చితకబాదారు. అనంతరం ఆయన ఇంటి పై రాళ్లు విసిరి భయభ్రాంతులను చేసారు. ఈ ఘటన కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 08:11 PM IST
    Follow us on

    Allu Arjun Arrest : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గోడని దూకి లోపలకు వెళ్లి, అడ్డుకున్న సెక్యూరిటీ ని చితకబాదారు. అనంతరం ఆయన ఇంటి పై రాళ్లు విసిరి భయభ్రాంతులను చేసారు. ఈ ఘటన కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దాడి చేసింది ఎవరు అనేది పరిశీలించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన కార్యకర్తలని తెలిసింది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆయన దిష్టి బొమ్మని తగలబెట్టడమే కాకుండా, లోపల ఉన్న పూలకుండీలను బద్దలు కొట్టి, అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకొని వెళ్లారు. ఈ సంఘటన కి సంబంధించిన విజువల్స్ ని చూసి అభిమానులు కంగారు పడ్డారు.

    అల్లు అర్జున్ ఇంట్లో అతని పిల్లలు ఉన్నారు, భార్య స్నేహ రెడ్డి ఉంది, ముసలోళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్లంతా జరుగుతున్న ఈ ఘటనలను చూసి చాలా భయపడ్డారు. ముఖ్యంగా పిల్లలు అయితే వణికిపోయారు. ఇక్కడే ఉంటే వాళ్ళు మరింత భయపడుతారని అల్లు అర్జున్ వాళ్ళని తన సిబ్బంది చేత ఆయన మామయ్య ఇంటికి కారులో పంపేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది కచ్చితంగా క్షమించరాని నేరం. కచ్చితంగా అల్లు అర్జున్ ఇంటికి పోలీస్ రక్షణ కావాలి. భవిష్యత్తులో ఇంతకు మించిన సంఘటనలు జరగొచ్చు. నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ ని విమర్శించినా వాళ్ళు కూడా నేడు ఆయన ఇంటి పై జరిగిన ఈ దాడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు తెలంగాణ లో లా & ఆర్డర్ ఎటు వైపు వెళ్తుంది అంటూ నిలదీస్తున్నారు.

    సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట కారణంగా దురదృష్టం కొద్దీ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్నాడు. ఆ కుటుంబానికి సంతాపం తెలిపి, అల్లు అర్జున్ ఆర్థికంగా ఆదుకుంటానని, వైద్యానికి అయ్యే ఖర్చు కూడా తానే పెట్టుకుంటాను అంటూ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా శ్రీ తేజ్ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలంటూ, కోటి రూపాయిలను డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు వీరంగం సృష్టించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు అభిమానులు. ఎందుకంటే అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ పై చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా దీనిపై నేడు హెచ్చరికలు జారీ చేసారు.