Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. #RRR తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్స్ తో హైప్ ని జనరేట్ చేయలేకపోయాయి. విడుదల తర్వాత కంటెంట్ సర్ప్రైజ్ చేస్తుందని అనుకుంటే దారుణంగా మిస్ ఫైర్ అయ్యింది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో మాత్రమే వచ్చింది. సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలకు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు మొదటి రోజు నుండే రావాలి. కానీ కేవలం వంద కోట్లతో సరిపెట్ట్టుకోవాల్సి వచ్చింది.
ఎట్టకేలకు వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ సినిమాకి 19 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 7 వ రోజు అయితే నైజాం లోని అన్ని ప్రాంతాల్లో డెఫిసిట్స్ వచ్చాయి. షేర్ ఒక్క రూపాయి కూడా మిగలలేదు. సీడెడ్ లో మాత్రం 7వ రోజు 20 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా సీడెడ్ లో మొదటి వారం ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ ప్రాంతంలో 23 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ వీకెండ్ తో క్లోజింగ్ కలెక్షన్స్ వేసేసుకోవచ్చు. ఫుల్ రన్ లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లకు మించేలా లేదు. అదే విధంగా ఈ చిత్రానికి ఉత్తరాంధ్రలో 9 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని పోల్చి చూస్తే ఉత్తరాంధ్ర ఒక్కటే ఇప్పుడు ఈ సినిమాకి మంచి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో 7 కోట్ల 30 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 80 లక్షలు, గుంటూరు జిల్లాలో 6 కోట్ల 30 లక్షలు, కృష్ణ జిల్లాలో 5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల 70 లక్షలు, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 67 కోట్ల రూపాయిల షేర్, ప్రపంచవ్యాప్తంగా 107 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 190 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంటున్నారు.