FROM web series review: హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు కానీ , వెబ్ సిరీస్ లకు కూడా ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా హాలీవుడ్ లోని కొన్ని హారర్ వెబ్ సిరీస్ లను చూసిన తర్వాత , అందులోని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వెబ్ సిరీస్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అమెజాన్ ప్రైమ్ వీడియో లో 2022 వ సంవత్సరం లో FROM అనే హారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పటి వరకు 3 సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఈ వెబ్ సిరీస్. నాల్గవ సీజన్ ఈ నెల 19 న స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ ని చూడని ఆడియన్స్ కోసం , ఈ రివ్యూ ని అందిస్తున్నాము , క్లుప్తంగా చూడండి.
కథ :
ఒక ఊరిలో సాయంత్రం దాటితే దెయ్యాలు తిరుగుతుంటాయి. బయటకు వచ్చిన జనాలను అత్యంత క్రూరంగా చంపి తినేస్తుంటాయి. వీళ్ళు చూసేందుకు మనుషులు లాగానే కనిపిస్తారు. మానవుల బుర్రలను ఏమార్చడానికి చాలా ప్రేమగా మన ఇంట్లోని కిటికీ వద్దకు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళని నమ్మి కిటికీ తెరిస్తే ఇక అంతే సంగతులు. పాప్ కార్న్ ని తిన్నట్టు మనుషులను తినేస్తారు అన్నమాట. అయితే ఈ ఊరిలోను జనాలు పుట్టుక నుండి ఆ ఊర్లోనే ఉన్నవాళ్లు కాదు. ఫ్యామిలీ తో కలిసి సరదాగా ట్రిప్ కోసం వచ్చిన వాళ్ళు , మధ్యలో ఈ ఊరిలో చిక్కుకుంటారు. ఎంత ప్రయాణం చేసిన ఈ ఊరి నుండి బయట పడలేరు. అలాంటి మిస్టీరియస్ ఊరు అన్నమాట. అసలు ఎందుకు ఈ ఊరిలో దెయ్యాలు తిరుగుతున్నాయి?, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే వెంటనే ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో చూడడం మొదలు పెట్టండి.
విశ్లేషణ:
మొదటి ఎపిసోడ్ , మొదటి సన్నివేశం లోనే మన గుండె జారీ ప్యాంట్ లోకి వచ్చినంత పని అవుతుంది. మధ్యలో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు సాగదీసినట్టు గా అనిపిస్తాయి కానీ , స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా హారర్ అనుభూతి మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రతీ ఎపిసోడ్ లోనూ ఒక ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా మూడవ సీజన్ లోని చివరి ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ ని ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ట్విస్ట్ తో మూడవ సీజన్ ని ముగిస్తారు. నాల్గవ సీజన్ కోసం మరో పది రోజులు ఎదురు చూడాలి. ఈ వెబ్ సిరీస్ తెలుగు లో అందుబాటులో లేదు. కేవలం ఇంగ్లీష్ , హిందీ మరియు ఇతర ఫారిన్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ , హిందీ తో పాటు ఇతర ఫారిన్ భాషల్లో కూడా సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
చివరి మాట :
ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే , హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఎంజాయ్ చేసేవాళ్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. హోమ్ థియేటర్ ఉంటే, మంచి సౌండింగ్ తో చూడండి , ఆ అనుభూతి అదుర్స్.