Senior NTR Sons And Daughters: దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నగారి కుటుంబంలో ఇంతటి తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటి వరకు ఎంత మంది కన్నుమూసారనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.
నాలుగేళ్ల క్రితం హరికృష్ణ కారు యాక్సిడెంట్‌లో కన్నుమూశారు. అంతకు ముందు జానకి రామ్ కూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. అందుకే, అసలు ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్తులయ్యారు అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.
మహానటుడు, మహా నేత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి చనిపోయారు. రామకృష్ణ మరణాన్ని జీర్ణించుకోవడానికి ఎన్టీఆర్ గారికి చాలా ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత పుట్టిన కుమారుడికి ఎన్టీఆర్ గారు రామకృష్ణ జూనియర్ అని పేరు పెట్టుకున్నారు.
ఇక కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ ఐదో కుమారుడు సాయి కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు. సాయి కృష్ణ అంటే ఎన్టీఆర్ గారికి అమితమైన ఇష్టం. సాయి కృష్ణ కూడా ఎన్టీఆర్‌కు సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ చూసుకునేవారు.
ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గారు చనిపోయారు. ఎన్టీఆర్ గారితో ఒక్క హరికృష్ణ గారు మాత్రమే చాలా దైర్యంగా మాట్లాడేవారట. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ హరికృష్ణ గారు తనదైన ముద్రను వేశారు. 2018 ఆగష్టు 29న రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు చనిపోయారు.
నేడు ఎన్టీఆర్ నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేడుకుని చనిపోయారు. ఎన్టీఆర్ గారికి మొత్తం 12 సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు.
ఇందులో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. తాజాగా కంఠమనేని ఉమా మహేశ్వరి కలిపి మొత్తం నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో 5 గురు కుమారులు, 3 ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలోనే హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసాడు.