Sai Dharam Tej : ఆ ప్రాంతంలో 12 ఎకరాల భూమిని లాగేసుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్..అసలు ఏమి జరిగిందంటే!

సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 12 ఎకరాల విస్తీర్ణం లో భారీ సెట్ ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం షూటింగ్ అక్కడే జరుగుతుంది, ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసారు. 12 ఎకరాల్లో సెట్స్ అంటే చిన్న విషయం కాదు. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు ఇంతటి విస్తీర్ణంలో సెట్స్ వేస్తుంటారు.

Written By: Vicky, Updated On : September 23, 2024 8:17 pm

Sai Dharam Tej

Follow us on

Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోలలో ఒకరు సాయి ధరమ్ తేజ్. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాతోనే తనలోని ఎనెర్జిటిక్ నటన, కామెడీ టైమింగ్ తో అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఆ తర్వాత ఆయన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోల లీగ్ లోకి దూసుకెళ్తున్న ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ పలకరించాయి. ఇంకో ఫ్లాప్ పడితే మార్కెట్ పూర్తిగా పోతుంది అని అనుకునే సమయంలో ఆయనకు ‘చిత్రలహరి’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి మళ్ళీ కం బ్యాక్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ‘ప్రతిరోజు పండగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి భారీ సూపర్ హిట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్నాడు.

2022 వ సంవత్సరం లో ఈయన హీరోగా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తో ఆయన వంద కోట్ల గ్రాస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఆయన తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ద్రుష్టి మొత్తం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంది. కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ ఒక భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హీరోయిన్ ‘ఐశ్వర్య లెక్ష్మి’ నటిస్తుంది. ఆమెకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేసారు. ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని ఖర్చుకి వెనకాడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 12 ఎకరాల విస్తీర్ణం లో భారీ సెట్ ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం షూటింగ్ అక్కడే జరుగుతుంది, ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసారు. 12 ఎకరాల్లో సెట్స్ అంటే చిన్న విషయం కాదు. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు ఇంతటి విస్తీర్ణంలో సెట్స్ వేస్తుంటారు. అలాంటిది ఒక నూతన దర్శకుడు ఇంత భారీ సెట్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్నాడంటే, సబ్జెక్టు ఎంత బలమైనదో అర్థం అవుతుంది. ఈ చిత్రం కోసం సుమారుగా 120 కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారట. తెలుగు తో పాటుగా, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని గ్లిమ్స్ వీడియో తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.