Bigg Boss 8 telugu : బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న మహేష్ బాబు మరదలు..ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా!

ఇలా బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన ఆర్టిస్టులు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. కేవలం తెలుగు బిగ్ బాస్ షో మాత్రం ద్వారానే కాదు, తమిళం, కన్నడ , హిందీ మరియు మలయాళం ఇండస్ట్రీస్ లో కూడా ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సరికొత్త జీవితాలను పొందారు.

Written By: NARESH, Updated On : September 23, 2024 9:07 pm

Bigg Boss 8 telugu

Follow us on

Bigg Boss 8 telugu : బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియా లోనే ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే షోస్ లో నెంబర్ 1 అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా, సినిమాల్లో ఫేమ్ ని కోల్పోయిన ఆరిస్ట్స్ కి మళ్ళీ వెలుగులోకి వచ్చే అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తుంది. ఈ షో అలా ఎంతో మంది ఆర్టిస్టులకు సరికొత్త జీవితాన్ని అందించింది. ఉదాహరణకు గత సీజన్ లో శివాజీ ని తీసుకోవచ్చు. చాలా కాలం నుండి ఈయన అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. సినిమాల ద్వారా ఆయన సంపాదించిన క్రేజ్ అంతంత మాత్రమే. కానీ బిగ్ బాస్ ద్వారా ఆయన సంపాదించిన క్రేజ్ మామూలుది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఫలితంగా ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే చేతినిండా సినిమా ఆఫర్స్ తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.

ఇలా బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన ఆర్టిస్టులు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. కేవలం తెలుగు బిగ్ బాస్ షో మాత్రం ద్వారానే కాదు, తమిళం, కన్నడ , హిందీ మరియు మలయాళం ఇండస్ట్రీస్ లో కూడా ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సరికొత్త జీవితాలను పొందారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 6 వ తేదీ నుండి హిందీ లో బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం కాబోతుంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో హిందీ లో ఏకంగా 17 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు 18 వ సీజన్ ని ప్రారంభించుకోబోతుంది. ఇండియా లోనే మొట్టమొదట బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయ్యింది హిందీ లోనే. ఇదంతా పక్కన పెడితే అక్టోబర్ 6 న మొదలయ్యే బిగ్ బాస్ సీజన్ 18 లో ఒక కంటెస్టెంట్ గా మహేష్ బాబు మరదలు అడుగుపెట్టబోతుందట. ఆమె పేరు శిల్పా శిరోద్కర్, ఈమె నమ్రత శిరోద్కర్ సోదరి.

ఈమె 1989 వ సంవత్సరం లో ‘భ్రష్టాచార్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఈమె ‘కిషన్ కన్నయ్య’, ‘ఖుదా గవా’,’త్రినేత్ర’, ‘హమ్’, ‘ఆంఖేన్’, ‘గోపి కిషన్’, ‘మృత్యు నాధ్’, ‘బేవఫా సనమ్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు లో ఈమె బ్రహ్మ అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ ని పలకరించింది కానీ, పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. అలా బాలీవుడ్ ఆడియన్స్ బాగా సుపరిచితమైన ఈమె, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుంది.