https://oktelugu.com/

Naga Chaitanya And Sobhita: చరిత్రలో మొట్టమొదటి సారి ఆ ప్రాంతంలో పెళ్లి..సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న నాగ చైతన్య, శోభిత జంట!

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే వీళిద్దరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్టూడియో లో పెళ్లి మండపం ని ఏర్పాటు చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారట. ఆకర్షణీయమైన డెకరేషన్ తో నింపేస్తున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 02:41 PM IST

    Sobhita And Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya And Sobhita: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన అక్కినేని నాగ చైతన్య , శోభిత దూళిపాళ్ల పెళ్ళికి సంబంధించిన హడావడినే కనిపిస్తుంది. ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, వచ్చే నెల నాల్గవ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వరకే శోభిత దూళిపాళ్ల పెళ్ళికి సంబంధించిన పనుల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండ అనుసరిస్తూ ఆమె నేటి తరం ఆడవాళ్ళకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. పెళ్లి కూడా ఆమె సొంత ఊరులోనే చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ముందుగా వైజాగ్ లో జరుగుతుందని అనుకున్నారు, ఆ తర్వాత తెనాలి లో చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.

    కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే వీళిద్దరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్టూడియో లో పెళ్లి మండపం ని ఏర్పాటు చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారట. ఆకర్షణీయమైన డెకరేషన్ తో నింపేస్తున్నారట. ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోలేదు. అదే విధంగా ఇండస్ట్రీ లో కూడా ఎవ్వరూ ఇలా చేయలేదు. అక్కినేని నాగేశ్వర రావు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఇదే స్టూడియోస్ లో ఖననం చేసారంటూ కాబట్టి ఇక్కడ చేసుకుంటే ఆయన ఆశీస్సులు కూడా అందుతాయని అక్కినేని కుటుంబం భావించారట. దీనికి శోభిత కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడంతో వీళ్లిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో వచ్చే నెల డిసెంబర్ 4న అట్టహాసంగా జరగనుంది.

    ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ తో పాటు రాజకీయ నాయకులూ, వ్యాపార వేత్తలు కూడా హాజరు కానున్నారు. ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల, సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు హాజరు కాలేకపోయేవారు. హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత రిసెప్షన్ తో సరిపెట్టేవాళ్ళు. కానీ చాలా కాలం తర్వాత సెలెబ్రిటీలు మన తెలుగు రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ సందడి ని మొత్తం మనం సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూడొచ్చు. ఈ పెళ్ళికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే అక్కినేని కుటుంబం అధికారికంగా తెలియచేయనుంది.