https://oktelugu.com/

Pushpa: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !

Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా పాన్ ఇండియా గోలే. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమాలే. అందుకే, పాన్ ఇండియా రేంజ్ లోనే తమ సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే, పుష్ప విడుదల ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం. ఎందుకంటే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న చిత్రాల లిస్టులో అల్లు అర్జున్ ‘పుష్ప’ టాప్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 02:48 PM IST
    Follow us on

    Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా పాన్ ఇండియా గోలే. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమాలే. అందుకే, పాన్ ఇండియా రేంజ్ లోనే తమ సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే, పుష్ప విడుదల ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం.

    Pushpa

    ఎందుకంటే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న చిత్రాల లిస్టులో అల్లు అర్జున్ ‘పుష్ప’ టాప్ టెన్ లో చోటు సంపాదించుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అట. అసలు టాప్ టెన్ లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే.. బాహుబలి సెకండ్ పార్ట్ తొమ్మిది వేల థియేటర్స్ లో రిలీజ్ అయి మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానం విషయానికి వస్తే సాహో పేరు మీద ఉంది.

    సాహూ 7978 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక మూడవ స్థానం విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది. సైరా సినిమా 4672 థియేటర్లలో రిలీజ్ అయింది. 4వ స్థానం విషయానికి వస్తే బాహుబలి మొదటి పార్ట్ ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 4 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది.

    ఇక 5వ స్థానం విషయానికి వస్తే.. ఆ స్థానం పుష్పకే దక్కింది. అవును, పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ 3 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అయితే, పుష్పకు ఈ స్థానం ఎక్కువ రోజులు దక్కేలా లేదు. ఆర్ఆర్ఆర్ నెంబర్ వన్ ప్లేస్ లోకి వస్తోంది. మిగిలిన టాప్ రిలీజ్ సినిమాలు ఇక తమ స్థానాన్ని మార్చుకుంటాయి.

    Also Read: RRR Movie: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే

    అపుడు పుష్ప స్థానం కూడా మారుతుంది. అయితే, ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. పుష్ప రిలీజ్ రికార్డు స్థాయిలో అవుతున్నా.. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి సైరా కంటే తక్కువ స్థాయిలోనే సినిమా రిలీజ్ అవుతుంది. అన్నట్టు పవన్ అజ్ఞాతవాసి 2800 థియేటర్లలో రిలీజ్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 2600, మహేష్ స్పైడర్ 2400 థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.

    Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…

    Tags