https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ముందు శివాజీ.. తర్వాత అర్జున్ ను ఏడిపించేసిన బిగ్ బాస్.. ఫ్యామిలీ ఏమోషన్ వీడియో వైరల్

అర్జున్ కోసం ఆయన భార్య వచ్చింది. ఆమె నెలలు నిండిన గర్భవతి కావడంతో మరింత ఎమోషన్ పండింది. నన్ను బాగా మిస్ అయ్యావని అని అడిగింది ఆమె. అవునని అర్జున్ అన్నాడు. తర్వాత అర్జున్ గేమ్ లోని లోపాలు చెప్పింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2023 / 05:23 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. రెండు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్ కి రిలీఫ్ దొరికింది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వస్తూ ఆనందం పంచుతున్నారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతున్నారు. శివాజీ కోసం పెద్ద కొడుకు వచ్చాడు. డాక్టర్ గెటప్ లో వచ్చి షాక్ ఇచ్చాడు. ముసుగు తీసే వరకు శివాజీ తన ముందు ఉంది కొడుకని కనిపెట్టలేకపోయాడు. తెలిశాక గట్టిగా కౌగలించుకుని ఏడ్చేశాడు.

    అనంతరం అర్జున్ కోసం ఆయన భార్య వచ్చింది. ఆమె నెలలు నిండిన గర్భవతి కావడంతో మరింత ఎమోషన్ పండింది. నన్ను బాగా మిస్ అయ్యావని అని అడిగింది ఆమె. అవునని అర్జున్ అన్నాడు. తర్వాత అర్జున్ గేమ్ లోని లోపాలు చెప్పింది. నువ్వు నీ ఎమోషన్స్ బయటపెట్టు. నువ్వు రియాక్ట్ కావడం లేదు. కప్పు ముఖ్యం బిగిలు అని విజయ్ మూవీలోని డైలాగ్ కొట్టింది. అర్జున్ ఆట పట్ల భార్య సంతృప్తిగా లేదని ఆమె మాటల్లో అర్థం అవుతుంది.

    ఇక హౌస్ మేట్స్ అర్జున్ భార్యకు సీమంతం చేయాలని నిర్ణయించారు. పల్లవి ప్రశాంత్ కిచెన్ నుండి పండ్లు, పూలు తీసుకొచ్చాడు. కొత్త చీర ఇచ్చి, బొట్టు పెట్టి, పూలు పెట్టి వేడుక ఘనంగా చేశారు. ఆ సమయంలో అర్జున్ తో పాటు ఆయన భార్య ఎమోషనల్ అయ్యారు. ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. కొంత సమయం గడిపాక, బాధగా భార్యకు అర్జున్ వీడ్కోలు పలికాడు. బిగ్ బాస్ హౌస్లో భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

    శివాజీ, అర్జున్ లకు కుటుంబ సభ్యులతో మీటింగ్ ముగిసింది. అర్జున్ భార్యను ఇంటి సభ్యులు బయట ఏం జరుగుతుందని అడిగారు. అది చెప్ప కూడదని జోక్ చేసింది. అశ్వినితో మా ఆయన అంటే భయం పోయిందా అనడంతో ఆమె గట్టిగా నవ్వేసింది. ఇంకా ప్రియాంక, శోభ, ప్రశాంత్, గౌతమ్, అమర్, యావర్, భోలే, రతిక కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. అనూహ్యంగా 9వ వారం తేజ ఎలిమినేట్ అయ్యాడు. అమ్మను హౌస్లోకి తీసుకు రావాలన్న కల చెదిరిందని బాధపడ్డాడు.