Upasana Birthday : నేడు ఉపాసన కొణిదెల పుట్టినరోజు. 1989 జులై 20న జన్మించిన ఉపాసన 34వ ఏట అడుగుపెట్టారు. ఈ దోమకొండ సంస్థానం వారసురాలు యంగ్ ఏజ్ లోనే బిజినెస్ టైకూన్ గా అవతరించారు. అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆమె యంగ్ ఎంట్రప్రెన్యూర్ మాత్రమే కాదు. సామాజిక సేవకురాలు. గొప్ప స్పీకర్. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ మనిషికంటూ లక్ష్యాలు ఉండాలి. వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని భావిస్తారు. అందుకే వివాహమైన పదేళ్ల తర్వాతే పిల్లలు అనే నియమం పెట్టుకుని తూచా తప్పక పాటించారు.
Upasana Birthday : తల్లి అయ్యాక మొదటి పుట్టినరోజు… ఉపాసన కోసం మెగా ఫ్యామిలీ ఊహించని ఏర్పాట్లు!
పిల్లల్ని కనడం ఒక బాధ్యత. అందుకు మనం సంసిద్ధత కావాల్సి ఉంది. వారికి మంచి జీవితం ఇవ్వగలమనే నమ్మకం కలిగినప్పుడే సంతానం పొందాలని ఆమె అంటారు. చరణ్ నేను పదేళ్ల తర్వాతే ఫ్యామిలీ ప్లానింగ్ అని ఒప్పందం చేసుకున్నాం. ఈ క్రమంలో ఫ్యామిలీ, సొసైటీ ఒత్తిడికి గురి చేసినా మా ఒప్పందం బ్రేక్ చేయలేదని ఆమె చెప్పారు. అపోలో గ్రూప్ లో ఉపాసన వాటా విలువ పది వేల కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.
రామ్ చరణ్-ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఉపాసన-రామ్ చరణ్ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ ఏడాది జూన్ 20న ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అర్ధరాత్రి ఆమెకు డెలివరీ అయ్యింది. ఘనంగా బారసాల నిర్వహించి క్లిన్ కార అనే పేరు పెట్టారు. లలిత సహస్రనామం నుండి క్లిన్ కార అనే పేరును తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
క్లిన్ కార గొప్ప జాతకురాలు, కీర్తిలో పేరెంట్స్ ని దాటేస్తారని పండితులు చెప్పారు. క్లిన్ కార కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా గదిని రూపొందించారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్ ఆ గది ఏర్పాటులో భాగమయ్యారు. ఇక తల్లి అయ్యాక ఉపాసన జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. అందుకే మెగా కుటుంబ సభ్యులు ఉపాసన బర్త్ డే ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఉపాసన బర్త్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయని సమాచారం. రామ్ చరణ్ ఆమెకు ఖరీదైన బహుమతి ఇవ్వనున్నాడట.