భాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమల్లో నట వారసులు హవా నడుస్తోంది. స్వయం కృషితో పైకి ఎదిగిన కొందరిని పక్కనపెడితే.. అన్ని భాషల్లో ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. హిందీలో హీరోయిన్లు కూడా దూసుకెళ్తున్నారు. అయితే, బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీలో నట వారసులను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతిభావంతులైన ఇతరులను తొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దాంతో, కొన్ని రోజుల నుంచి నట వారసులు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి టైమ్‌లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నది అనవసరం అని, నటి కావాలన్నదే తన కల అని ఖుషీ ఆ వీడియోలో మాట్లాడింది.
కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?
తమది బిజినెస్ ఫ్యామిలీ అని, వాళ్లతో కలిసి పని చేయడం తనకు ఇష్టమని చెప్పింది. అయితే, బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు ఇంకొంత సమయం పడుతుందని, ఈ లోపు నటిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే ఫిల్మ్ స్కూల్‌లో తన నటనను ప్రూవ్ చేసుకున్నానని, ఇప్పుడిక సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేసింది. అక్క జాన్వీ కపూర్ బాటలో హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న ఖుషీ ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేసింది. అక్కడ నేర్చుకున్న అంశాలతో పాటు సినిమాల్లో నటించబోతున్న అనే విషయాన్ని ఆమె వెల్లడించింది. దాంతో, ఖుషీ సినీ రంగ ప్రవేశానికి తండ్రి బోనీ కపూర్ బ్యాగ్రౌండ్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అయితే, శ్రీదేవీ నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీకే ఇప్పటిదాకా సరైన బ్రేక్ లభించలేదు. మరి, తల్లి, అక్క కంటే అందంగా లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్న ఖుషీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.