https://oktelugu.com/

Anasuya: నన్ను ఆంటీ అంటారేంటి ?.. ఫీల్ అవుతున్న అనసూయ !

Anasuya:  తనను ‘ఆంటీ’ అంటే అనసూయ ఫైర్ అవుతుంది. అయినా, నెటిజన్లు మాత్రం అనసూయ ను ఆంటీ అని పిలుస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. దాంతో ‘నన్ను ఆంటీ అంటారేంటి ?’ అని ఫీల్ అవుతూ.. నెటిజన్స్ పై అనసూయ సీరియస్ అవుతూ ఉంటుంది. అసలు ఫుల్ బిజీగా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌ గా ఉండటానికి అనసూయ బాగా ఆరాటపడుతుంది. నెటిజన్స్ తో అనసూయ తన ఇన్‌ స్టాలో చిట్ చాట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 11:25 AM IST
    Follow us on

    Anasuya:  తనను ‘ఆంటీ’ అంటే అనసూయ ఫైర్ అవుతుంది. అయినా, నెటిజన్లు మాత్రం అనసూయ ను ఆంటీ అని పిలుస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. దాంతో ‘నన్ను ఆంటీ అంటారేంటి ?’ అని ఫీల్ అవుతూ.. నెటిజన్స్ పై అనసూయ సీరియస్ అవుతూ ఉంటుంది. అసలు ఫుల్ బిజీగా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌ గా ఉండటానికి అనసూయ బాగా ఆరాటపడుతుంది. నెటిజన్స్ తో అనసూయ తన ఇన్‌ స్టాలో చిట్ చాట్ చేసింది.

    Anchor Anasuya

    ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మిమ్మల్ని ఎలా పిలవాలి.. ఆంటీ లేదా అక్క. ’ అని ఒక ప్రశ్న అడిగాడు అనసూయను. దానికి స్పందించిన అనసూయ..‘ఏదీ వద్దు. అసలు నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు తెలీదు కదా. మరి ఎందుకు పిలవడం ? అంటూ.. పనిలో పనిగా ఎప్పటిలాగే సీరియస్ అవుతూ.. ‘అసలు ఈ ప్రశ్న ఏజ్ షేమింగ్ అనిపిస్తుంది. నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అంటూ ఆ నెటిజన్ కి స్ట్రాంగ్ గా మెసేజ్ పెట్టింది.

    Also Read: భయంకర వ్యాధులతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్లే..

    Anasuya Without Makeup

    ఇక అనసూయ, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ లో కూడా నటించబోతుంది. ఆమె పాత్ర గతంలో చిరును ప్రేమించి, కొన్ని కారణాల వల్ల దూరమైన పాత్ర అని ప్రచారం జరుగుతుంది. ఎలాగూ అనసూయ బాడీ లాంగ్వేజ్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి. దర్శకుడు మోహన్ రాజా కూడా అందుకు తగ్గట్టుగానే అనసూయ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడని తెలుస్తోంది.

    Also Read: రాజమౌళి సినిమాల్లో ఈ ప్రత్యేకతలు గమనించారా..?

    Tags