Vastu Tips for Couples: సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. ఇలా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్న నేపథ్యంలో భర్త లేదా భార్య ఒక అడుగు వెనక్కి తగ్గి ఆ సమస్యను పరిష్కరించుకుంటే అంతటితో సమాప్తమవుతుంది లేదంటే ఎన్నో పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.ఇలా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగే వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవడం జరుగుతుంది.ఇలా కౌన్సిలింగ్ తీసుకున్నప్పటికీ వారి మధ్య గొడవలు సమసిపోకుండా అలాగే ఉంటే తప్పనిసరిగా వారి పడక గదిలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే వారి పడకగది ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం…
ముఖ్యంగా పడక గదిలో భార్య భర్తలు పడుకోవడానికి ఉపయోగించే మంచం చెక్కది మాత్రమే అయి ఉండాలి. ఇనుము మంచం పై పడుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు తలెత్తే వారి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా మంచం పై రెండు పరుపులను కలిపి కాకుండా ఒకే పరుపు వేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు తల దిండులను మాత్రమే ఉపయోగించాలి. ఇక మంచం ఎప్పుడూ కూడా తూర్పు పడమర దిశ ఉత్తర-దక్షిణ దిశలో ఉండాలి.ఎల్లప్పుడు తూర్పు వైపు లేదా దక్షిణం వైపు మాత్రమే తల పెట్టుకుని పడుకోవాలి.
Also Read: లవర్‌తో బయటకు వెళ్లిన అమ్మాయి.. బెదిరించి దారుణానికి ఒడిగట్టిన మందుబాబులు..!
ఇక వారంలో కనీసం ఒకరోజు మన పడకగదిని నీటిలో సముద్రపు ఉప్పు వేసుకుని గది మొత్తం శుభ్రం చేసుకోవడం వల్ల గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముఖ్యంగా పడక గదిలో అలంకరించుకునే ఫోటోల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పడకగదిలో ఎప్పుడూ కూడా ఏడ్చేవి, యుద్ధాలు జరిగేవి, గొడవపడే ఫోటోలు ఉండకూడదు. ఎల్లప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే ఫోటోలు సంతోషకరమైన ఫోటోలు ఉండేలా చూసుకోవాలి. ఇక పడక గదిలో ప్రతి ఒక వస్తువును ఎంతో చక్కగా అలంకరించుకున్నప్పుడే ఆ గది మొత్తం సానుకూల వాతావరణం ఏర్పడి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఎప్పుడు చిందరవందరగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి వారి మధ్య కలహాలకు దారితీస్తుంది. కనుక పడక గదిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.
Also Read: హైదరాబాద్‌కు వస్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!