
కలైరసన్, సాయి ధన్సిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’. ఈ భయపెట్టే చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. చాలా అద్భుతంగా భీతిగొలిపేలా ఉంది. మైమ్ గోపి, జయబాలన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విక్కీ ఆనంద్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే తమిళంలో విడుదలై హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన ‘స్పార్క్’ ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. అది గగొరుపొడిచేలా ఉంది.
ఒక హత్యను క్రైమ్ గా కాకుండా ఆర్ట్ లా చూసే వ్యక్తి కథ అంటూ సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్ ను కట్ చేయించారు. తన కథలు ఔట్ డేటెడ్ గా ఉంటున్నాయని బాధపడే ఒక ఫిక్షనల్ రైటర్.. ఓ కొత్త థ్రిల్లర్ కథ రాయడానికి ఒక హిల్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత అక్కడ తను ఎదుర్కొన్న భయానక సంఘటనలు ఏంటనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరింతంగా భయం ఉన్న ఈ హర్రర్ టీజర్ ను ఆసక్తి రేపుతోంది.
అక్షయశ్రీ సమర్పణలో హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫియర్ ట్రైలర్’ ఈరోజు విడుదల చేశారు. జూన్ 12న రేపు స్పార్క్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.
https://www.youtube.com/watch?v=LL6dIvVU-2Q