
దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 3,403 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది. ఇందులో 2,77,90,073 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,63,079 మంది మరణించారు.